విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
:భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం భారత రాజ్యాంగం నవంబర్ 26వ తేదీన 395 ఆర్టికల్స్ 22 భాగాలుగా ఆవిర్భవించిందని దళిత యువజన నాయకులు బక్కి సందీప్ పేర్కొన్నారు. మండలకేంద్రమైన రాయవరం గ్రామంలో భారత భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకులు దళిత నాయకుడు గొట్టి సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దళిత పెద్దలు, యువకులు అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దళిత యువజన నాయకులు బక్కి సందీప్ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం భారత రాజ్యాంగం నవంబర్ 26వ తేదీన 395 ఆర్టికల్స్ 22 భాగాలుగా ఆవిర్భవించింది. ప్రస్తుతం భారత రాజ్యాంగం 488 ఆర్టికల్స్ 12 షెడ్యూలు ,25భాగాలుగా విభజింపబడినది.తిరిగి 1950 జనవరి 26వ తేదీనుండి భారతదేశంలో ఈ భారత రాజ్యాంగం అమల్లోనికి రావడంతో భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద,ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది,, భారత రాజ్యాంగము ఈ భారత దేశంలో ఉండే పేద, మధ్యతరగతి,అణగారిన వర్గాల వారి అందరికీ స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాతృత్వం,మత స్వాతంత్ర్యపు హక్కును, అస్పృశ్యత నిర్మూలన, మత స్వేచ్ఛపు హక్కును, మహిళల రక్షణ కొరకు ప్రత్యేకమైన చట్టాలను,తీసుకుని రావడం జరిగిందనీ. భారత రాజ్యాంగము 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఆస్తిలో సమాన హక్కును తీసుకురావడం జరిగిందనీ. ప్రాథమిక హక్కులను,ప్రాథమిక విధులు,ఆదేశిక సూత్రాలు వంటి మహాద్భుతాలను భారత జాతికి భారత రాజ్యాంగం ద్వారా అందించిన మహా పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో నేతల సురేష్, గంటా ఏసుదాసు, మళ్లీడి దుర్గాప్రసాద్,చప్పాల సుభాష్, అంబటి నవీన్ గోసాల శేఖర్, దళిత పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.