విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని సీఎం జగన్ ఆదర్శంగా నిలిపారని మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామ సచివాలయం 2 వద్ద శుక్రవారం గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్కు సీఎం జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, ఎంపీపీ నౌడు వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూర్చిన మేలును వివరిస్తూ రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం “ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి” ( వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమమని, అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్న ఆంధ్ర ప్రదేశ్ కి మళ్లీ జగనే ముఖ్యమంత్రి, మండపేట నియోజకవర్గం వైకాపా కోఆర్డినేటర్, ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులను కావాలన్నారు. జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని జగన్ మోహన్ రెడ్డి పొత్తు మాత్రం ప్రజలతో అని అన్నారు. తోలితగా
గ్రామ సచివాలయ పరిధిలో ఏ ఏ పథకం ద్వారా ఎంత మేలు జరిగిందో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి ప్రదాత తేతలి సుబ్బిరామిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ బొడ్డు శ్రీను, ఎంపీటీసీ గంటి రోజా, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు పడాల కమలారెడ్డి, కొల్లు రాంబాబు, ఈఓపిఆర్డి శ్రీనివాస్, ఎం ఎల్ యు రాజేష్,మండల జెసిఎస్ కన్వీనర్ (మాచవరం జగన్), మండల గృహ సారధుల కన్వీనర్ చింత సుబ్బారాయుడు, నల్లమిల్లి వెంకటరెడ్డి, చింతా సురేష్ రెడ్డి, గృహ సారథులు, గ్రామ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.