సీజనల్ గా చిన్న పిల్లల్లో వచ్చే వైరల్ జ్వరాలు గురించి వివరించారు,విచక్షణారహితంగా యాంటీబయోటిక్స్ వాడడం వలన వచ్చే అనర్ధాలను తెలిపారు.
విశ్వంవాయిస్ న్యూస్, నిడదవోలు
నిడదవోలు,విశ్వం వాయిస్ న్యూస్:
కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) నిడదవోలు,కొవ్వూరు మండలాల ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు ఆదివారం నిడదవోలు ఆనంద్ ఇన్ కాన్ఫరెన్స్ హాల్ నందు మండల అధ్యక్షులు పోతుల సత్య వరప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాజమండ్రికి చెందిన లిటిల్ స్టార్స్ అండ్ షి ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ సౌభాగ్య లక్ష్మీ హాజరై మాట్లాడుతూ మహిళలు ఇబ్బందులు పడే గర్భకోశ వ్యాధులను ఏవిధంగా గుర్తించాలి, ఏవిధమైన ప్రధమ చికిత్సలందిచాలో వివరించారు.చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ సీజనల్ గా చిన్న పిల్లల్లో వచ్చే వైరల్ జ్వరాలు గురించి వివరించారు,అలాగే విచక్షణారహితంగా యాంటీబయోటిక్స్ వాడడం వలన వచ్చే అనర్ధాలను తెలిపారు. జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు ఏ అనారోగ్యం వచ్చిన ముందుగా స్పందించే పీఎంపీలు నూతన వైద్య విధానాలపై అవగాహన కల్గి ఉండాలని తెలిపారు. జిల్లా కార్యదర్శి పీ దేవానందం మాట్లాడుతూ ప్రతి సభ్యులు వార్షిక రెన్యూవల్ చెల్లించాలని,నెలవారీ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాండ్రాకుల వీర వెంకట సత్యనారాయణ,కోశాధికారి పేరూరి ధాన శంకరం, సీహెచ్ సత్యనారాయణ మూర్తి, తోరం వీరు వెంకట్రావు గోవిందరావు శ్రీనివాస్ కృష్ణారావు సురేష్ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.