విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రౌతులపూడి:
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మండలంలో వాడవాడలా 40వ టిడిపి ఆవిర్భావ వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రౌతులపూడి గ్రామంలో నిర్వహించిన వేడుకలకు ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల రాజా హాజరై తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు జరుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.