విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట:
మహేంద్ర మేదరి సంఘం జిల్లా స్థాయి ఎన్నికలు జగ్గంపేటలో నిర్వహించారు. జగ్గంపేట-గోకవరం రోడ్డు లో పోలవరం కాలువ వద్ద డిగ్రీ కాలేజ్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో మేదర సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు జిల్లా నలుమూలల నుంచి మేదరి సంఘం సభ్యులు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో అదక్షుని పదవికి అభ్యర్థులుగా ముగ్గురు బరిలో నిలిచారు. అంగర కు చెందిన ఆరిచిన్న, ఇంజరం గ్రామానికి చెందిన రొట్ట శ్రీనివాస్, కాకినాడకు చెందిన దోమ్మా చిన్న అనే ముగ్గురు వ్యక్తులు అధ్యక్షుని బరిలో నిలవగా అయితే పటిష్టమైన నిబంధనలతో ముగ్గురు అభ్యర్థుల కి మూడు గుర్తు లతో కూడిన బ్యాలెట్ పేపర్ లను ఓటు వేసే అభ్యర్థులకు అందించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మేదర సంఘం సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ వోటింగ్ పధ్ధతి ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో దోమ్మా చిన్న అనే వ్యక్తి 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దోమ్మా చిన్న జిల్లా అధ్యక్షునిగా విజయం సాధించడంతో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన సంఘం సభ్యులు అంతా ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగింది. జిల్లా అధ్యక్షునిగా గెలుపొందిన దో మ్మా చిన్న దంపతులను పూలమాలతో సత్కరించి, భారీ తీన్మార్ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ జిల్లా ఎన్నికకు జగ్గంపేట మేదర సంఘం యూనియన్ పూర్తి సహాయ సహకారాలు, ఆతిథ్యాన్ని అందజేశారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు దోమ్మా చిన్న సంఘం అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మేదర సంఘం సభ్యుల అభ్యున్నతికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, అనునిత్యం సంఘం సభ్యుల శ్రేయస్సుకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మేదర సంఘం అధ్యక్షులు మొగ్గా కన్నయ్య, పిల్లి రావణ, రొట్టి ఏసు, దోమ్మ బద్రి, మొగ్గా శివ, దోమ్మ దుర్గారావు, రోట్ట అప్పారావు, మొగ్గ ఆనంద్, గ్రంధి రాజు, రోట్టా సత్తి బాబు, మొగ్గ మోజేష్ తదితరులు పాల్గొన్నారు.