విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన మండలం పోలీస్ శాఖ వారి ఆదేశాలతో ప్రతి గ్రామ సచివాలయం నందు నియమించబడ్డ మహిళా పోలీస్ ఆధ్వర్యంలో దిశ యాప్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ దిశ యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేస్తూ దిశ ఉపయోగాలు, అత్యవసర సేవలు, గూర్చి ప్రజలకు తెలియజేస్తున్నారు. నేడు ఉప్పూడి గ్రామ సచివాలయం మహిళా పోలీస్ గుత్తుల అనురాధ మరియు వాలంటీర్ ఎల్ రాంబాబు, యు అరుణకుమార్, ద్విచక్ర వాహనదారులకు, మహిళలకు యువతి ,యువకుల ఫోన్ లో దిశ యాప్ డౌన్లోడ్ చేసి వారి కుటుంబీకులకు సంబంధించి ఇద్దరూ లేదా ఐదుగురు మొబైల్ నెంబర్లు అప్లోడ్ చేస్తున్నారు. దిశ యాప్ పై రెండుసార్లు నొక్కిన (ఎస్ ఓ ఎస్) వారికి వెంటనే సమాచారం వెళుతుంది ఎస్ ఓ ఎస్ వారి ద్వారా దగ్గరలో గల పోలీస్ స్టేషన్ వారికి సమాచారం తెలియజేసి ఎవరైతే దిశ యాప్ లో ఫిర్యాదు చేశారో వారికి వెంటనే రక్షణ గాని అత్యవసర సేవలు గాని కల్పిస్తారని ఉప్పూడి మహిళా పోలీస్ గుత్తుల అనురాధ వివరించారు