విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
పి గన్నవరం మండలం డొక్కా వారితోటలో పిగన్నవరం ఐ.టి.డి.పి అధ్యక్షుడు గనిశెట్టి ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ ఐ.టి.డి.పి అధ్యక్షులు బాలాజీ వేమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేందుకు ఐ.టీడీపీ అనే తెలుగుదేశం పార్టీలో అనుబంధ కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ ఐ.టీ.డీ.పి ఈ కార్యవర్గంలో ఒక అధ్యక్షులు గ్రామాలవారీగా కన్వీనర్లు ఉంటారని తెలియజేశారు ఈ కార్యవర్గం మొదటి సమావేశంలో వివిధ అంశాల పై చర్చించుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్క నాధుబాబు పిగన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు అప్పారి మహేష్ మండల అధ్యక్ష కార్యదర్శులు తోలేటి సత్తిబాబు పెచ్చెట్టి పెద్ద ఈ కార్యవర్గంలో గ్రామ కన్వీనర్లుగా ఉడుమూడి కుక్కునూరుసుబ్రమణ్యం. పిగన్నవరం కడలి నాగరాజు.ఎల్.గన్నవరం పిళ్లి స్వామి.వేమన గంగాధర్.మొండెపులంక ఆరుమిల్లి పాపారావు. నాగుల్లంక ఆరుమిల్లి మణిరత్నం.వాడ్రేవుపల్లి కోళ్ల సాయి.కెఏనుగుపల్లి మట్టపర్తి దుర్గాప్రసాద్ వైకొత్తపల్లి కేశవరపు రాంప్రసాద్ రాజులపాలెం పెట్టా ప్రసాద్.ముంజవరం వాతాడిదొరబాబు.తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు