సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్
వీణు గోపాల కృష్ట..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ సిటీ న్యూస్: జర్నలిస్టుల సమస్యలపై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ కు ప్రెస్ క్లబ్ కాకినాడ వినతి పత్రం అందజేసింది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి గా శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా జర్నలిస్టులతో మంగళవారం జిల్లా రెవిన్యూ భవన్ కార్యాలయంలో జర్నలిస్టుల తో ముఖాముఖి కార్యక్రమం మంత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుకి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుతగా మంత్రి చెల్లుబోయిన వేణు కి జర్నలిస్ట్ నాయకులు కృష్ణ, శోభన బాబు, విశ్వం వాయిస్ ఎడిటర్ కే సునీల్ జాన్ కుమార్, ఏ చిన్న బాబు, గుత్తుల సాల్మన్ దొరా లు మంత్రిని ప్రెస్ క్లబ్ అఫ్ ఆధ్వర్యంలో దుశ్శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ప్రధానంగా జిల్లాలో ఉన్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్రిడేషన్ మంజూరు కాని వారికి వెంటనే అక్రిడేషన్ లు మంజూరు చేయాలని, కాకినాడ పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ కు భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ. జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.