Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

శిశు మరణాలపై ప్రభుత్య నిర్లక్ష వైకారి విడనాడాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన సంఘటన పై
ప్రభుత్యం వెంటనే స్పందించాలి. సుంకర డిమాండ్.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ సిటీ న్యూస్: శిశు మరణాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై కాకినాడ సంతచేరువు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పావని ఆధ్వర్యములో కొవ్వత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టటం జరిగినది.
తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన శిశు మరణాలపై కాకినాడ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు నరక కూపాలుగా మారాయని. దీనికి ఉదాహరణే తిరుపతి రుయా ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో పదహారు మంది శిశు మరణాలు జరిగితే. ఈ మరణాలపై ప్రభుత్వం కనీసం స్పందించక పోవడం చాలా భాదకరం అని ఈ సంఘటన జరిగిన స్పందించని ప్రభుత్వం పేద ప్రజల పై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా లో ఉన్న ఆసుపత్రిలో నిత్యం కరెంటు కోతలతో రోగులు అల్లాడుతున్న పట్టించుకోని ఈ ముఖ్యమంత్రి ఇక ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కి ఆయన అనుచర గణానికి ప్రజలు ఎమై పోయినా ఫర్వాలేదు వచ్చే ఎన్నికల్లో ఎలా ఓట్లు వేయించు కోవాలి లక్ష్యం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమై పోయినా ఈ ముఖ్యమంత్రి కి పట్టడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి శిశు మరణాల పై స్పందించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు నిరంతర విద్యుత్ ను అందించాలని లేకుంటే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చంనాయుడు ఆదేశాల అనుసారం అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
సుంకరపావని తిరుమల కుమార్,
మాజీ మేయర్ మరియు కాకినాడ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement