Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రజా సేవలో దూసుకు పోతున్న వాలంటీర్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ప్రజా సేవలో ముందున్న వాలంటీర్లంటే అసూయె "
ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్యత ప్రసాద్ అభినందన
వాలంటీర్లకు అభినందనల వెల్లువ
ఎమ్మెల్యే, ఎంపీపీలకు వాలంటీర్ల సన్మానం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:

 

శంఖవరం, ఏప్రిల్ 19, (విశ్వం వాయిస్ న్యూస్) ;

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కన్నా ప్రజా సేవలను అందించడంలో ముందున్న వాలంటీర్లు అంటేనే సహజంగానే ఒకింత అసూయ మిగతా వారిలో ఏర్పడిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ వలంటీర్లను ప్రశంసించారు. సచివాలయ వ్యవస్థ పటిష్టతలో భాగంగా ప్రజలకు నేరుగా వారి ఇంటి వద్దనే ప్రభుత్వ పధకాలను అందించే లక్ష్యంతో నియామకంమైన వాలంటీర్లు వారి నిరంతరం విధి నిర్వహణలో ప్రజలతో మమేకం కావడం, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పధకాలన్నీ వాలంటీర్ల ద్వారానే అందుతున్న విధానం విజయం వంతం కావడంతో, వారికి దక్కుతున్న గౌరవం మిగతా వారికి దక్కక పోడంతో
వాలంటీర్లపై అసూయ ఏర్పడేంత ఉన్నతంగా వాలంటీర్లు సేవలు కొనసాగుతున్నాయని, వారి నిస్వార్థ సేవలను గుర్తించి నందునే వాలంటీర్లను ప్రభుత్వం ఏటేటా పురస్కారాలతో సన్మానిస్తోందని ఎమ్మెల్యే పర్వత వివరించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండలం కేంద్రం శంఖవరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పాత ఆస్పత్రి ఖాళీ స్థలంలో మండలంలోని వాలంటీర్లు అందరికీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు
అభినందన సభను నిర్వహించారు. శంఖవరం మండలంలో 14 పంచాయతీల పరిధిలో మొత్తం 250 మంది వాలంటీర్లకు గాను 230 మందిలో
కత్తిపూడికి చెందిన పోలవరపు ప్రమీల సేవా వజ్ర,
శంఖవరం నుంచి రేలంగి వీరవెంకటసత్య నారాయణ, బోణం లోవరాజు, కత్తిపూడి నుంచి దూళ్ళ కృష్ణ, పిట్టు వెంకటేష్, మండపం నుంచి చప్పా వీరబాబు సేవా రత్న, మిగతా వారందరూ సేవా మిత్ర బిరుదు పురస్కారానికీ ఎంపిక అయ్యారు. వీరందర్నీ ఎమ్మెల్యే, శంఖవరం ఎంపీపీ. పర్వత రాజబాబు, మండలంలోని మిగతా సర్పంచులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వాలంటీర్ల సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. సేవా వజ్ర, సేవా రత్నలను వేదికపై సంయుక్తంగానూ, సేవా మిత్రలను వారి 14 పంచాయతీల పరిధిలోని 16 సచివాలయాల వారీగా వారి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికార్ల సమక్షంలోనూ శాలువాలతో అభినందించి ఘనంగా సన్మానించారు. అందుకు ప్రతిగా, కృతజ్ఞతగా ఈ సన్మాన గ్రహీతలు అందరూ కూడా సంయుక్తంగా ఎమ్మెల్యే, ఎంపీపీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ పధకాలన్నీ నేరుగా ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లు సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే పర్వత ప్రశంసించారు. ప్రజాప్రతినిధుల సిఫారసులు లేకుండా ప్రభుత్వ పధకాలన్నీ ప్రజలకు నేరుగా మీరే అందిస్తూ ఉన్నారనీ, మాకన్నా మిమ్మల్నే అధికంగా ప్రజలు గౌరవిస్తూ ఉన్నారనీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పధకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత వాలంటీర్లపైనే ఉందని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ స్పష్టం చేశారు. అనంతరం అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా కూడా సభికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాగారపు రాంబాబు, శంఖవరం పంచాయతీ కార్యదర్శులు సీహెచ్.శ్రీరామచంద్రమూర్తి, కోడూరి శంకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

విలేకర్లకు అవమానం…
________________

ఈ కార్యక్రమానికి స్ధానిక పాత్రికేయులను నేరుగా ఎవరూ ఆహ్వానించలేదు. దీనిని విలేకరులు అవమానంగా భావించారు. ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని సామాజిక మాధ్యమం వేదికగా ఎంపీడీవో సోమవారం శబ్ద సందేశాన్ని పంపారు. అంతే తప్ప ఏ ఒక్కరికీ నేరుగా కబురు పంపలేదు. అలాగే ఫోన్ ఆహ్వానం కూడా పంపలేదు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో 2 గంటలకంటే వచ్చి చూసుకుని జరగలేదని కొందరు పాత్రికేయులు తిరిగి వెనక్కి వెళ్లి పోయారు. నిజానికి కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటలకు నిర్వహించారు. ఐతే ఈ నిర్దిష్ట సమాచారాన్ని పాత్రికేయులకు అందజేయకుండా వారిని తప్పుదోవ పట్టించి అవమానించారు. ఖచ్చిత సమాచారం ఉన్న కేవలం ఇద్దరు విలేకరులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. మండల కేంద్రంలో మండల స్థాయి బహిరంగ సభా సమావేశం, అందునా ఎమ్మెల్యే హాజరయ్యే ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆహ్వానం ఇంత అఘోరంగా ఉందంటే ప్రభుత్వ అధికారులకు, మీడియాకు మధ్య ఏదో ఒక అంతరం ఉందన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement