కార్యకర్తలు…
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు….
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాపీలేశ్వరపురం:
కపిలేశ్వరపురం, విశ్వం వాయిస్ న్యూస్: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే గ్రామ వాలెంటీర్లు సేవలు వెలకట్టలేని వని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో బుదవారం సర్పంచ్ చోడే రామతులసి వేంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన గ్రామ వాలంటీర్లు పురస్కారాల ప్రదానోత్సవం సభలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని మాట్లాడుతూ కుల,మత,వర్గ,ప్రాంతం, పార్టీల కతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలును వారికి కేటాయించిన 50 కుటుంబాలకు అందిస్తున్న వాలంటీర్లు ఒక గుర్తింపు పొందారన్నారు. నామ మాత్రపు గౌరవవేతనంతో సేవలు నిర్వహిస్తున్న వాలంటీర్ల కు ఇటువంటి సత్కారాలు వా రికి ఆత్మతృప్తి కల్గుతుంద ని తోట త్రిమూర్తులు అన్నారు. తొలుతగా వేదికపై వున్న దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం గ్రామ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు తో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాగంగా ఓ టి ఎస్ చెల్లించిన హౌసింగ్ లబ్ధిదారులకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రిజిస్ట్రేషన్ పట్టా లు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడి శెట్టి సత్యవేనిదుర్గారావు, వైస్ ఎంపీపీ గుణ్ణం భాను ప్రసాద్,రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చుండ్రు చిట్టిబాబు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పుట్టా కృష్ణబాబు, రెడ్డి రాధ కృష్ణ, నక్క సింహాచలం, నాయుకులుపలివెల మధు,అడ్డాల శ్రీనివాస రావు, వాసా కోటేశ్వర రావు, కుక్కల వీరన్న, గూటం సత్య నారాయణ,కొండేటి వేంకటేశ్వర రావు, శనక్కాయాల దొరబాబు, ఎంపిడివో వెంకట్రామన్, తహసీల్దార్ చిన్నా రావు,ఈ ఓ పి ఆర్ డి రామకృష్ణ రెడ్డి , సర్పుంచ్ లు ,గ్రామ కార్యదర్శులు, వాలెంటీర్లు, సచివాలయం సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.