ముఖ్యమంత్రి రాక
నేడు ముఖ్యమంత్రి బిక్కవోలు పర్యటన
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం / బిక్కవోలు, విశ్వం వాయిస్ః
ఏప్రిల్ 21 గురువారం రోజున దొంతమూరు/బలభద్రపురం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు అనగా
గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన లో భాగంగా “గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ ” యూనిట్ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్నారు. ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి ఉ.10.05 కి తాడేపల్లి లోని హెలిప్యాడ్ కి చేరుకొని, ఉ.10.10 కి హెలికాప్టర్ ద్వారా బలభద్రపురం కి బయలుదేరుతారు. ఉదయం 10.50 కి బలభద్రపురం హెలిప్యాడ్ కి చేరుకొంటారు. అక్కడ ప్రముఖులు ముఖ్యమంత్రి కి స్వాగతం పలుకుతారు. అనంతరం ఉ.11. 00 కి బయలుదేరి ఉ.11.05 గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్లాంట్ కి చేరుకొని , ప్రత్యేక వాహనం లో ఉ.11.05 నుంచి ఉ. 11.20 వరకు ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య బిర్లా తో కలిసి ప్లాంట్ ను సందర్శించడం జరుగుతుంది. తదుపరి ఉ.11.20 కి ప్రధాన సభా వేదికకు చేరుకుంటారు. ఉ.11.25 నుంచి మ.12.25 మధ్య “గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ యూనిట్” ప్రారంభోత్సవ కార్యక్రమం లో భాగంగా శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేస్తారు. అనంతరం మ.12.25 కి ప్రధాన వేదిక నుంచి బయలుదేరి మ.12.30 కి హెలిప్యాడ్ కి చేరుకొంటారు. ప్రముఖులు వీడ్కోలు అనంతరం ముఖ్యమంత్రి బలభద్రపురం నుంచి తాడేపల్లి కి హెలికాప్టర్ ద్వారా మ.12.40 కి బయలుదేరి వెళ్తారు అని మీడియాకు సమాచారం.