గుమ్మిలేరు సర్పంచ్ గుణ్ణం రాంబాబు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమురు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్): మండలం మడికి గ్రామ సచివాలయం-2 ఉద్యాన శాఖ సహాయక ఉద్యోగిని ఉందుర్తి ధనలక్ష్మి మృతి చాలా బాధాకరమని గుమ్మిలేరు సర్పంచ్ గుణ్ణం రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మడికి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ధనలక్ష్మి మృతికి గురువారం ఏర్పాటుచేసిన సంతాప సభలో ధనలక్ష్మి ఆత్మకు శాంతి కలగాలని మడికి సర్పంచ్ యు లక్ష్మి మౌనిక, గుమ్మిలేరు సర్పంచ్ గుణ్ణం రాంబాబు, కార్యదర్శి ఎమ్ మోక్షాంజలి ఆధ్వర్యంలో కొద్ది సమయం మౌనం పాటించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పుచెరువుగట్టు గ్రామానికి చెందిన ధనలక్ష్మి కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని సహచర ఉద్యోగులు ద్వారా గుర్తించిన గుమ్మిలేరు సచివాలయం ఉద్యోగులతో పాటు సర్పంచ్ గుణ్ణం రాంబాబు సమకూర్చిన పదివేల రూపాయల నగదును మడికి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిల ద్వారా ధనలక్ష్మి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ సచివాలయంలో సహసర ఉద్యోగులతో నవ్వుతూ సౌమ్యంగా ఉండే ఈమె మృతి తీరనిలోటని, ఇలాంటి మంచి వ్యక్తిత్వం గల ఉద్యోగిని కుటుంబాన్ని ఆదుకోవడం మానవులుగా మన కనీస కర్తవ్యం అని గుణ్ణం రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మడికి వైయస్సార్ సిపి నాయకులు పడమటి రాంబాబు, యూ.చిన్న, పలువురు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.