Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కొమ్ము విరిగిన పశువుకు అరుదైన శాత్రచికిత్స

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గేదెకు చికిత్స చేస్తున్న పశు వైద్యుడు భానుప్రసాద్.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో ఓ రైతుకు చెందిన సుమారు రెండు లక్షల విలువచేసే పాడి గేదెకు అనివార్య కారణాలతో కొమ్ముకు దెబ్బ తగలడంతో దానిని అత్యవసరంగా తొలగించివలసి ఉండగా మండల పశు వైద్యులు భాను ప్రసాద్ తన సిబ్బందితో సుమారు రెండు గంటలపాటు చికిత్స నిర్వహించి గేదెకు గల కొమ్మును తొలగించారు. గేదెకు దెబ్బతగిలిన రెండు గంటల లోపు కొమ్ము అత్యవసరంగా తొలగించవలసి ఉందని, అలా చేయని యెడల ప్రాణ నష్టం కలుగుతుందని, సుమారు రెండు గంటలపాటు ఇద్దరు వైద్యులు, మరో ముగ్గురు సిబ్బందితో అత్యవసర శస్త్ర చికిత్స చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇటువంటి సంఘటనలు పశువుల్లో చాలా అరుదుగా జరుగుతుందని పశు వైద్యులు భానుప్రసాద్ తెలిపారు. ఈ వైద్య సేవలో పశు వైద్యులు వినోద్ కుమార్, సూర్యనారాయణ మూర్తి, రాజేష్, పశు సహాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement