Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకని గోవర్ధన్ రెడ్డి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– మంత్రిగా బాధ్యతలు చెప్పటిన కాకాణికి పెర్నాటి అభినందలు
-వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 43వేళా కోట్లు కేటాయింపు
-రైతులకు సేవచేసుకునే అవకాశం కల్పించిన సీఎం జగ్స్న్ కు
కాకాణి ధన్యవాదాలు
కాకాణి రెండు పైలపై సంతకం
-3-75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగెషన్ పై తొలి సంతకం
-వైఎస్సార్ యంత్ర పధకం కింద ఇచ్చే ఫైల్ పై రెండో సంతకం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:

 

అమరావతి, విశ్వం వాయిస్ః

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాకాణి రెండు ఫైళ్ల పై సంతకం చేశారు. తొలుత సంతకం చేశారు. 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ అవకాశం కల్పించే ఫైల్ పై ఆయన సంతకం చేశారు.అదేవిధంగా వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైల్ పై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ రైతుల పక్షపాతి అని, ఇప్పటి వరకు రూ. 20 వేల కోట్లకు పైగా రైతు భరోసా నగదును బదిలీ చేశామని అన్నారు.తనకు వ్యవసాయ మంత్రిగా రైతులకు సేవచేసుకొనే అవకాశం కల్పించిన సీఎం జగన్ కు కాకాణి ధన్యవాదాలు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 43వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గన్నవరంలో రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
*కాకాణి ని సన్మానించిన పే ర్నాటి*
సచివాలయంలోని రెండో బ్లాకులో రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ని రాష్ట్ర వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందలు తెలిపారు.ఈ సందర్భంగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి, రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా మరియు వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ది పరచే విధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పనిచేయాలనిఆకాంక్షించారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement