Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నాటి హామీ నేటికి నెరవేరలేదు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సిపిఎస్ రద్దుపై మాటతప్పిన జగన్ రెడ్డి
సిపిఎస్ రద్దుకై కాకినాడ చేరుకున్న పొరుగర్జన బైక్ ర్యాలీ
-ఏప్రిల్ 25 లోపు సిపిఎస్ రద్దు చేయాలని యుటిఎస్ డిమాండ్
-లేని పక్షంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని
ప్రకటించిన నేతలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) ఏప్రిల్ 25 లోపు రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) నేతలు ప్రకటించారు.
సిపిఎస్ రద్దుకై పోరుగర్జన పేరుతో ఈనెల 18 న శ్రీకాకుళం నుండి బయలు దేరిన బైక్ ర్యాలీ గురువారం మధ్యాహ్నం కాకినాడ చేరుకుంది. అచ్చంపేట జంక్షన్ లో రూరల్ యుటిఎఫ్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం భానుగుడి జంక్షన్ లో స్థానిక నగర యుటిఎఫ్ నేతలు స్వాగతం పలికి బాలాజీ చెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, కోశాధికారి బి‌. గోపిమూర్తి లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పరని ప్రచారం చేస్తుంటారని పేర్కొన్నారు. అయితే అధికారం లోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన మాట ఎందుకు తప్పారని ప్రశ్నించారు. 3 సంవత్సరాలు గడిచినా సిపిఎస్ రద్దు చేయలేదు సరికదా అవగాహన లేదని, ఫ్లోలో చెప్పారని కొందరు మంత్రులు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు ఏవిధమైన హామీ ఇవ్వకుండానే సిపిఎస్ రద్దు చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రి కి ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. సిపిఎస్ ఉద్యోగుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పై మరొక 20 సంవత్సరాలపాటు ఎటువంటి ఆర్ధిక భారం పడదని, ఎన్.పి.ఎస్. ట్రస్ట్ కు ప్రభుత్వం ఏటా చెల్లిస్తున్న 1000కోట్ల రూపాయలు మిగులుతాయన్నారు. కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేసి మాట నిలబెట్టుకోవాలని, లేకుంటే మరింత తీవ్రంగా ఆందోళన చేపడతామన్నారు. ఏప్రిల్ 25 వ తేదీ లోపు సిపిఎస్ రద్దు చేయాలని యుటిఎఫ్ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం యుటిఎఫ్ కార్యాలయం మీదుగా తాళ్ళరేవు మండలం వైపు బైక్ ర్యాలీ సాగింది.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి. రవి చక్రవర్తి, కోశాధికారి కెవిఎస్. నగేష్ , జిల్లా కార్యదర్శులు సూరిబాబు, పివిఎన్ గణేష్,బి. నాగమణి, గోవిందరాజులు, కెవి రమణ, ఐ. ప్రసాదరావు, సిహెచ్.వి.రమణ, లతో పాటు జోగా అప్పారావు, సీతారామయ్య, తానీషా, కె.ఎన్. రాజు, గిరిధర్ గోపాల్, వి. సోనీ, ఎం.బి.ఎన్‌ దేవి, రవి శ్రీనివాస్, సువర్ణ రాజు, జయప్రకాష్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement