Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇళ్ళు కట్టకుంటే ప్రభుత్వ ఇళ్ళు స్థలాలు రద్దు…!

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

"జగనన్న కాలనీల ఇళ్ళు నిర్మివహకపోతే అంతే
"మండల సమావేశంలో ప్రభుత్వ ప్రకటన

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:

 

శంఖవరం, ఏప్రిల్ 22, (విశ్వం వాయిస్ న్యూస్) ;

జగనన్న ఇండ్ల కాలనీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు మంజూరు చేసిన నివేశన స్థలాల్లో సకాలంలో ఇళ్ళను నిర్మించకపోతే ఆ స్థలాల పట్టాలను రద్దు చేసి, స్థలాలను వెనక్కి తీసుకుని వేరే కొత్త లబ్దిదారులకు మంజూరు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఇళ్ళు కట్టకుండా స్థలాలను అలానే ఉంచుకుని వాటికి ధరలు పెరుగుతాయి అనుకుంటే పొరపాటని, ఖచ్చితంగా ఇళ్ళను నిర్మించాల్సిందేనని, లేకుంటే ఆ స్థలాలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేయాలని అధికారులు ఖరాఖండిగా చెప్పారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండలం కేంద్రం శంఖవరంలోని మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో పాలక వర్గం సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిని సభకు వివరించారు. మండలం గృహ నిర్మాణ నిర్మాణ శాఖ తరఫున ఏఈ. వెంకటరమణ మూడు నెలల ప్రగతి నివేదికను సమర్పిస్తూ చివరిలో గృహాల నిర్మాణం ప్రారంభం కాని గ్రామాల్లో లబ్దిదారులను నిర్మాణానికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అన్నవరం ప్రజాప్రతినిధులు కల్పించుకుని ప్రశ్నలను సంధించారు. అన్నవరం గ్రామస్థులకు అన్నవరంలోనే ఇండ్ల స్థలాలను ఇవ్వాలి కాని 8 కిలోమీటర్ల దూరంలోని మండపం పరిసర పొలాల్లో ఇవ్వడమేమిటీ అని అన్నవరం ఎంపీటీసీ సభ్యులు దడాల సతీష్ ప్రశ్నించారు. అసలు ఏ ప్రజా ప్రతినిధులకు చెప్పి ఇచ్చారని నిలదీశారు. స్థానికంగా మిస్సమ్మ కొండ పైన, రిజన్ చెరువులోనూ, 171 సర్వే నెంబరులోనూ ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు మండపంలో ఎందుకు ఇచ్చారని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా కూడా ప్రశ్నించారు. అన్నవరం దేవస్థానంలోనూ, స్థానికంగా ఉన్న హొటళ్లు, దుకాణాల్లోనూ రాత్రి పూట పనులు ఉద్యోగాలు, చేసుకునే వారమని, రాకపోకల్లో ప్రమాదాలు జరుగు తాయని, మాకే రక్షణ లేదని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కుమార్ రాజా సభ దృష్టికి తెచ్చారు. దీనికి తాహసిల్దారు కర్నాసుల సుబ్రహ్మణ్యం బదులిస్తూ అప్పుడు ప్రజా ప్రతినిధులు ఎవరూ లేరని, ఉన్న ఎమ్మెల్యే, మండల అధికార యంత్రాంగం అంగీకారంతోనే ఇళ్ళ స్థలాలను ఇచ్చామని వెల్లడించారు. ఆ రోజు ప్రభుత్వంతో చెప్పి ఒప్పించాం కాబట్టే ఈ స్థలాలైనా మంజూరు అయ్యాయని, లేకపోతే అవి కూడా మంజూరు కావని ఎంపీడీవో జాగారపు రాంబాబు, మండల ప్రత్యేక అధికారి ఎం.వీరరాజు నచ్చజెపుతూ స్పష్టం చేశారు. లబ్దిదారులు పట్టాలు తీసుకుని, ఇళ్ళు పధకం మంజూరు చేయించుకుని, ఇప్పుడు వెనుకడుగు వేయడం, ఆపై నేతలను, ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేస్తూంటే వాటిని గమనించకుండా అర్ధ రహితంగా ప్రజా ప్రతినిధులు, అధికారుల పరస్పర చర్చలు, వాగ్వాదాలు చేసుకోడం నిష్ప్రయోజనంగా మారాయి. నెల్లిపూడి, కొంతంగి జగనన్న కాలనీల్లో ఇళ్ళు నిర్మాణానికి ఏర్పాటు చేసిన బోరు బావుల్లోని రెండు విద్యుత్ మోటార్లను ఆగంతకులు దొంగిలించుకు పోయిన నేపధ్యంలో మండపం లేఅవుట్లోని బోరు బావుల్లోని మోటార్లను ఆర్.డబ్ల్యూ.ఎస్.అధికారులు
ముందు జాగ్రత్తగా అన్నవరం పంచాయతీలో భద్రపరచి, అదే విషయాన్ని ఈ సమావేశంలో సర్పంచ్, ఏఈ. తేజ చెపుతూ లబ్దిదారులు ఇళ్ళు నిర్మించుకునే ఒక్క రోజు ముందు చెప్పితే మోటారులను బిగిస్తామని చెప్పితే బోర్లు లేనప్పుడు ఇళ్ళు ఎవడు నిర్మించు కుంటాడని ప్రశ్నించి చల్లగా వైస్ ఎంపీపీ. దారా వెంకట రమణ విషయ చర్చకు తెర లేపారు. ఎవరూ నిర్మాణానికి ముందుకు రాకే మోటార్లను దాచాల్సి వచ్చిందని, తేజ, ఏఈ, ఏఈ చెపుతూంటే తాహసిల్దార్ ఆ విషయానికి కొనసాగింపుగా మాట్లాడుతూండగా అసలు మండపంలో అన్నవరం లబ్దిదారులకు స్థలాలు ఇవ్వడం ఏంటనే చర్చ వేడెక్కి పతాక స్థాయికి చేరింది. అప్పుడు సభలో సంబంధంలేని బయట వ్యక్తి కల్పించు కుని తాసిల్దారును కూర్చోమని సైగ చేయడంతో తాహసిల్దారు తగ్గడంతో అనవసర చర్చ సద్దు మణిగింది. సభాధ్యక్షుడు పర్వత గుర్రాజు అనుమతి లేకుండా కొందరు అధికారులూ, ప్రజా ప్రతినిధులు, సభకు ప్రోటోకాల్ లేని వారూ ఎవరికి వారే స్వేచ్ఛగా తోచినట్టు మాట్లాడ్డం ఈ సభ ప్రత్యేకత. పధకాల వివరాలూ, అర్హతలను బయట తెలుసుకుని సభకు హాజరు కావలసిన ప్రజా ప్రతినిధులు వాటి గురించి సభలో అడిగి సమయాన్ని వృధా చేయడం ఒక ఎత్తు అయితే, అధికారులు కూడా చంటి పిల్లలకు వివరించి నట్టు పధకాల విధి విధానాలనుసభలో వల్లె వేయడంతో వారి విజ్ఞత సభలో తేటతెల్లం అయ్యింది. నిర్మాణాత్మకమైన, అభివృద్ధి పధమైన విషయాల కంటే అప్రధాన విషయాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం, సభకు ఒక ఎజెండాయే లేకపోవడం, గత సమావేశంలో వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల నివేదిక గానీ కనీస ప్రసక్తి గానీ లేకపోవడం లోపంగా అధికారులకు తోచకపోడం విశేషం. కొన్ని శాఖల అధికారులూ గైర్హాజరయ్యారు. మరికొన్ని శాఖల తరఫున అభివృద్ధి ప్రకటన, చర్చ జరగనే లేదు. ఇంత గొప్పగా జరిగిన ఈ సమావేశంలో మండలం విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారి కుమార్ రాజా ఉత్తమ సేవలను సభ్యులు, అధికారులు ఏకగ్రీవంగా ప్రశంసించడం వారిలోని మానవీయ కోణానికి అద్దం పట్టింది. అంతే సమంగా మిగతా శాఖల్లో అభివృద్ధి జరిగినా ఆయా శాఖల అధికారులు ప్రశంసలకు నోచుకోలేదు. ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ ఉంటే సభ హుందాగా ప్రయోజనకరంగా సాగేది. ఆయన ఈ సభలో లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement