Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

శంకుస్థాపన పనులలో మంత్రివర్యులు దాడి శెట్టి రాజా బిజీ బిజీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

""ఏ కోట్లుపల్లి గ్రామంలో గల హై స్కూల్ లో అదనపు
గదులకు 60 లక్షలు ఖర్చుతో నిర్మాణం, రోడ్లు మరియు
భవనాల శాఖ మంత్రివర్యులు దాడి శెట్టి రాజా "

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగ్గి:

 

తొండంగి: ఏప్రిల్ 22: విశ్వం వాయిస్ న్యూస్:
కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలోగల ఏ కొత్తపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ల మరియు భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా ఆదేశానుసారం ఈరోజు ఏ కొత్తపల్లి హై స్కూల్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొయ్య మురళి కృష్ణ, మండల ఎంపీపీ అంగులూరి అరుణ్ కుమార్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత ఆనందహరి, మండల వైస్ ఎంపీపీ నాగం గంగ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి మొదటిగా సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేశారు. తరువాత నాయకులు చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తరువాత అదనపు గదులు నిమిత్తము పలు వైఎస్ఆర్ నాయకులు చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అనంతరం సభను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ బెక్కం రాజు వరలక్ష్మి చంద్రగిరి మాట్లాడుతూ మన గ్రామ హై స్కూల్ ని 5వ ధనపు గదులు మంజూరు చేయడం జరిగింది. దాని నిమిత్తము ఈరోజు శంకుస్థాపన చేసాము. మళ్లీ మనకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు అలాగే వేదికపై ఉన్న పెద్దలు అందరినీ కోరుకుంటున్నానని సర్పంచ్ రాజు వరలక్ష్మి చంద్రగిరి కోరారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళి కృష్ణ మాట్లాడుతూ సరైన బల్లలు, టేబుల్స్ లేనటువంటి స్కూల్ కాంపౌండు లేని స్కూల్స్ ఒక ప్రక్క పిల్లలు మరోపక్క పశువులు మరోపక్క చెత్తాచెదారంతోటి నిండి ఉన్నటువంటి స్కూల్ ని ఈ రోజు కార్పొరేటర్ స్థాయికి పోటీగా ఈ రోజు పిల్లవాని నువ్వెక్కడ చదువుతారా అని అంటే నేను గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకుంటానని సగౌరవంగా ప్రతి కుర్రవాడు చెప్పుకునే విధంగా తీర్చిదిద్దే విధంగా మన ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. మండల ఎంపిడిఓ పి. సతీష్ మాట్లాడుతూ మేము ఇలాంటివేవీ ఎప్పుడూ చూడలేదు మేము కూడా చిన్న బోర్డు స్కూల్ నుంచే చదువుకొని రోజు ఈ స్థాయికి వచ్చిన వారమే మేము చదువుకున్న రోజుల్లో స్కూల్లో బల్లలు ఉంటే టేబుల్స్ ఉండేవి కావు అని ఎంపీడీవో సతీష్ అన్నారు. మండల వైస్ ఎంపీపీ నాగం గంగ బాబు మాట్లాడుతూ ఇవాళ మన కొత్తపల్లి గ్రామంలో గల హై స్కూల్ కి 60 లక్షల ఖర్చుతో అదనపు గదులు రావడం అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రావడం మనకు చాలా సంతోషకరమని అలాగే రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ రావడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే మొత్తం స్కూల్ కూడా మొదట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అయింది. ఇవాళ మిగతా కార్యక్రమాలు కూడా తన తనయుడైన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయ్యిందని ఎంపీపీ గంగ బాబు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గాబు రాజు, వైస్ ఎంపీపీ యాదాల వెంకటరమణ, ఈడి, జేఈ, మండల ఎం ఈ ఓ బాబ్జి, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు ఎలిశెట్టి గిరి, ఎంపీటీసీ చక్రం, ఎంపీటీసీ ఎలుగుబంటి రామలక్ష్మి రామకృష్ణ,ఎంపీటీసీ నందేపు చిన్న, వైఎస్ఆర్ నాయకులు అధికారులు,మండల ఎంపిటిసిలు, గ్రామ పంచాయతీల
సర్పంచులు, సచివాలయం సిబ్బంది, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement