Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మహిళా సాధికారత దిశగా ముందడుగు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

-స్వయం సహాయక సంఘాలు పేదరికాన్ని జయించాలి
-రవాణా శాఖ మంత్రి విశ్వరూప్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం, విశ్వం వాయిస్ః

స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీ ద్వారా పొందిన రుణాలను ఆదాయ వనరులు ఒనగూరే రంగాలలో పెట్టుబడిగా పెట్టి పేదరికాన్ని జయించాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.జిల్లా కలెక్టరేట్ నందు 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి గాను డ్వాక్రా సంఘాలు సకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడతగా వడ్డీ రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు నుంచి ప్రారంభించి స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో బటన్ నొక్కి నేరుగా నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుని బ్యాంకు లింకేజీ రుణాలు పొందిన వారికి 3వ విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా వడ్డీ రాయితీని రాష్ట్ర వ్యాప్తంగా రూ.12 కోట్ల 61 లక్షలు నేడు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన మూడు విడతల్లో రూ.3615 .29 కోట్ల మేర స్వయం సహాయక సంఘాల మహిళలు లబ్ధి పొందాయన్నారు.నూతనంగా ఏర్పడిన మన కోనసీమ జిల్లాలో 37 వేల 716 సంఘాలు రూ.30 కోట్ల 62 లక్షలు 3వ విడతలో వడ్డీ రాయితీని పొందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు సంక్షేమ పథకాల లబ్ధి ని మహిళల పేరునే అందిస్తూ మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తుందన్నారు.అక్క చెలెమ్మల ముఖాల్లో చిరునవ్వులు, జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళలు కుటుంబ సారథులుగా ఇంటి దీపాలు గా పూర్తి బాధ్యత వహిస్తూ ప్రగతిపథంలో నడవాలని సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతోoదన్నారు. మహిళల ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక ప్రగతి వైపు పయనించేందుకు మహిళా సాధికారతకు ఈ సంక్షేమ పథకాలు ఎంతగానో దోహదపడతాయని తదనుగుణంగా పేదరికాన్ని జయించి ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్నారు. నవరత్నాలులో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ఎంత అద్భుతంగా కొనసాగుతోందని దీన్ని స్వయం సహాయక సంఘాల వారు సద్వినియోగం చేసుకుని పేదరికం నుండి బయట పడాలని ఆయన సూచించారు స్వయం సహాయక సంఘం అక్కచెల్లెళ్లు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టి నవరత్నాల్లో చేర్చినట్లు ఆయన తెలిపారు.తద్వారా మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్థిక పురోగతికి తోడ్పడు తొందన్నారు. సంఘం యొక్క అప్పు నిల్వలో 3 లక్షల వరకు మాత్రమే సున్నా వడ్డీ వర్తిస్తుందన్నారు. వాయిదా బకాయి ఉన్న సంఘాలు పూర్తిగా చెల్లించిన పిదప మాత్రమే వడ్డీ రాయితీకి అర్హత సాధిస్తాయని అన్నారు. రుణాలు పొంది తద్వారా ఆదాయ వనరులు ఒనగూరే రంగాలలో పెట్టుబడిగా పెట్టి జీవనోపాదుల ఏర్పాటు చేసుకొని తద్వారా సంఘ సభ్యులు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హీమాన్సు శుక్లా , ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రాపాక వరప్రసాదరావు ,కొండేటి చిట్టిబాబు, డి ఆర్ వో సిహెచ్. సత్తిబాబు, ఏపీ డి ఎం ఎం. జిలాని, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement