– కలెక్టర్ డా. కే. మాధవీలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
పదోవ తరగతి పరీక్ష లను అత్యంత పక్బందీగా నిర్వహించడం కోసం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
స్థానిక నగర పాలక సంస్థ కార్యాయంలో శుక్రవారం విలేఖరులతో కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో 132 కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. సుమారు 25 వేల మంది విద్యార్థులు 10 వ తరగతి పరీక్షలు రాయడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం విద్యార్ధుల కు పరీక్షా సమయం అయినందున విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారుల కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. . ఏప్రిల్ 27 నుంచి మే 9 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించే ఆయా కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలకు కల్పించడం జరుగుతోందన్నారు. తరగతిగదిలో లైటింగ్, త్రాగునీరు, వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రాల లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్ళడానికి హల్ టికెట్ చూపితే ఆర్టీసి సంస్థ తో మాట్లాడి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని డా. మాధవీలత తెలిపారు. బస్సు రూట్ లేని పరీక్షా కేంద్రాల కు విద్యార్ధులు వెళ్లేలా ఆర్ టి వో ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆటో లను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రధానకూడళ్లలో, బస్ స్టాప్ వద్ద ఆటోలు అందుబాటులో ఉంచుతున్నా మన్నారు. నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందే విద్యార్ధులు పరీక్షా కేంద్రాల కు చేరాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ వి. వేణుగోపాల్ రావు, నగర పాలక సంస్థ కమీషనర్ కే. దినేష్ కుమార్ లు పాల్గొన్నారు.