-పౌరసంక్షేమ సంగం డిమాండ్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
స్వార్ధప్రయోజనాలకు తాకట్టు పడిన కార్పొరేటర్ల కారణంగా స్థానిక నగరపాలక సంస్థలో 2017-22 స్థానికపాలననిర్వీర్య మై నియంతృత్వంగా తయారైన ఎమ్మెల్యే మూర్ఖత్వపాలనకు నగర ప్రజలు పూర్తిగా విసుగుచెందారని పౌరసంక్షేమసంఘం పేర్కొంది. నగర విస్తరణ – ముంపువిముక్తికి అవసరమైన అభివృద్ధి -నిర్మాణా త్మకఆదాయ ప్రగతి లేకుండా నిధులను ముందస్తు వనరులను తీవ్రదుర్వినియోగంచేయడంలో ఘనత వహించినచరిత్ర156 ఏళ్ళల్లో ఇదేననిపౌరసంఘం కన్వీనర్ దూసర్లపూడిరమణరాజు పేర్కొన్నారు. రాబోయే 2022-27 ఎన్నికల్లో నగర ప్రగతి కాంక్షించే కొత్తవారిని సభ్యులుగాప్రజలు ఎన్నుకోవాలని స్వార్ధపరులను వ్యతిరేకించాలని కోరారు.స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిధులు రు.1,050 కోట్లు జనరల్ నిధులురు.1,000 కోట్లు గడచిన అయిదేళ్లలో వృధా చెందాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల కంటే ముందుగా చెత్త పన్నులు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి న ఘనత కాకినాడ కౌన్సిల్ దేనని పేర్కొన్నారు.
*కౌన్సిల్ తీర్మానం చేస్తేనే.. ఆ6గ్రామాలు కలుస్తాయి!?*
తూరంగి ఇంద్రపాలెం చీడిగ రమణయ్యపేట వలసపాకల వాకల పూడి గ్రామాలను ప్రభుత్వ పంచాయితీల పాలననుండి వేరు చేసి 12 ఏళ్లు అవుతున్నదని 5ఏళ్ల క్రిందట 7ఏళ్ల స్పెషల్ ఆఫీసర్ పాలన నుండి విముక్తి చెంది స్థానిక పాలన చేపట్టిన కాకినాడ కౌన్సిల్ ఆ 6గ్రామాలను విలీనం చేసుకునే తీర్మానం చేయక పోవడం వలన నగర విస్తరణ జరగడం లేదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. గంగనాపల్లి టీచర్స్ కాలనీ నుండి ఏర్పడిన 42,48 డివిజన్లు ఎన్ని కలు లేకుండా కోర్టు వ్యాజ్యానికి గురవుతు న్న కారణం కూడా ఇదేనన్నారు.
*అతిక్రమించిన..*
*ఆర్థిక అజెండా కట్టడి చేయాలి!!*
కౌన్సిల్ అజెండా నిర్వహణపై నియంత్రణ చర్యలు వహించాలని త్రాగు నీరు, పారిశుద్ధ్యం, పూడికల నిర్వహణ అత్యవసర పౌరసౌకర్యాల పనులకు మాత్రమే జనరల్ నిధులు వెచ్చించే కట్టడి చర్యలు ప్రభుత్వం వహించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. సెప్టెంబర్ నాటికి కౌన్సిల్ గడువు పూర్తవుతున్నందున మూడు నెలల ముందు ఎన్నికల నిర్వహణ రానున్నందున కార్పోరేషన్ ఆర్థిక ప్రగతిని కాపాడేందుకు కలెక్టర్ ముందస్తుగా తగు పరిశీలన వహించాలని కోరారు.