Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సారా పై జగ్గంపేట పోలీసులు ఉక్కుపాదం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అక్రమ సారా తరలింపై విస్తృతంగా దాడులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట:

 

జగ్గంపేట:విశ్వం వాయిస్ న్యూస్

జగ్గంపేటలో అక్రమ సారా తయారీ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జగ్గంపేట సి ఐ బి.సూర్య అప్పారావు, ఎస్సై రఘునాథరావు లు అక్రమ సారా తయారీ పై గ్రామ,గ్రామాలలో జల్లెడ పట్టారు. దీనిలో భాగంగా ఆదివారం సీఐ సూర్య అప్పారావు, ఎస్ఐ రఘునాథరావు సంయుక్త ఆధ్వర్యంలో తమ సిబ్బందితో సారా తయారీ బట్టీలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. జగ్గంపేట మండలంలోని రింగ్ రోడ్ పరిధిలో మామిడాడ గ్రామంలోని మారుమూల అటవీ ప్రాంతంలో అక్రమ సారా తయారీ కి ఉపయోగిస్తున్న సారా బట్టీ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కి సిద్ధంగా నిల్వ ఉంచిన 3200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అదేవిధంగా సారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలు మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీగా రవీంద్రనాథ్ బాబు బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి పెద్దాపురం అడిషనల్ ఎస్పీ అరిటాకులు శ్రీనివాసరావు నేతృత్వంలో అక్రమ సారా తయారీ, గంజాయి తరలింపు పై అనుక్షణం నిఘా ఉంచి, దాడులు చేయడంతో పాటు పెద్దఎత్తున కేసు నమోదు చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా సారా తయారీ కేంద్రాలపై విస్తృత దాడులు నిర్వహించడంతో సారా రహిత జగ్గంపేట మండలం గా తీర్చి దిదితే క్రమంలో ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేసి, 23 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 215 లీటర్ల నాటుసారాను సీజ్ చేసి, సుమారు 19,800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. మారుమూల గ్రామాల్లో రహస్యంగా నాటుసారా తయారుచేసిన, అమ్మకాలు నిర్వహిస్తున్న జగ్గంపేట సి ఐ 9440796529,ఎస్ ఐ 9440796569 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement