Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా పంచాయతిరాజ్ దినోత్సవం వేడుక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

-పురుషోత్తపట్నం పంచాయతీలో ముగ్గుల పోటీలు నిర్వహణ
-విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపిటిసి జీ.వి.రామిరెడ్డి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఏటపాక:

ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ : మండలంలోని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ధానిక సర్పంచ్ బుద్దా.ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ , డాక్టర్ బిఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి పాల్గోని మాట్లాడుతూ 1993 ఏప్రిల్ 24వ తేదీ నుండి ప్రధమంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే గ్రామపంచాయతీ వ్యవస్థ అని దీన్నే స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ మరియు పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారని ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గ్రామపంచాయతీ వ్యవస్థ ద్వారా గ్రామస్వరాజ్యం లభిస్తుందని సువిశాల దేశానికి పల్లెలు పట్టు కొమ్మలని గాంధీజీ కన్న కలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వికేంద్రీకరణ చేసి నిరూపించారని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధేనని , అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీలలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. గ్రామాలకు వెన్నముక లాంటి స్థానిక సంస్థల స్వపరిపాలన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్ లో కొనసాగుతున్నట్లు ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు , వాలంటీర్లకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ఎంపిటిసి గొంగడి వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సారెడ్డి.శ్రీనివాసరెడ్డి , గ్రామపంచాయతీ కార్యదర్శులు రఘుబాబు , పి.నాగేశ్వరరావు , ఫీల్డ్ అసిస్టెంట్ కుమారి , ఇంజినీరింగ్ అసిస్టెంట్ రవీంద్ర , మహిళా పోలీస్ , సచివాలయం సిబ్బంది , వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement