విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్) కోనసీమ జిల్లా, రావులపాలెం మండలం, రావులపాలెంలో సి పి ఎస్ రద్దు చేయాలని కోరుతూ, రాష్ట్ర యుటిఎఫ్ పిలుపుమేరకు తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు తరలి వెళ్తున్న నేపథ్యంలో, కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో పోలీసు ఉన్నతాధికారులు, పోలీసులు వారిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక జాతీయ రహదారిపై, రావులపాలెం సి ఐ వెంకట నారాయణ, రావులపాలెం ఎస్సై భానుప్రసాద్ తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ నిర్వహించారు. బస్సులు, కార్లు ఆటోలు, తదితర వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. గోపాలపురం చెక్ పోస్ట్ వద్ద, సిద్ధాంతం బ్రిడ్జి ఎంట్రన్స్ లోనూ విస్తృతంగా తనిఖీలు చేశారు.