మధుసూనరావు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్.జే.డి మధుసూదనరావు అన్నారు. సోమవారం స్థానిక డీఈవో కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, రంపచోడవరం, పాడేరు, జిల్లాలో 358 పరీక్ష కేంద్రాలను నిర్వహిస్తున్నామని, మొత్తంగా 66680 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. బాలురు 33201, బాలికలు 33479 మంది పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యారని, అత్యధికంగా స్థానిక జిల్లాలో అత్యల్పంగా పాడేరులో విద్యార్థులు హాజరవుతున్నట్లు మధుసూదన్ రావు తెలిపారు. స్థానిక జిల్లా వ్యాప్తంగా 144, తూర్పుగోదావరి జిల్లా 79, కోనసీమ 112, రంపచోడవరం,పాడేరు జిల్లాలలో 23 పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నామన్ని, పరీక్ష కేంద్రాల వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ ఉంటుందని, రెండు వందల మీటర్ల దూరం వరకు ఎటువంటి జిరాక్స్ షాప్ లు తెరవకూడదన్నారు. గతంలో 2 పేజీలు ఉండేవని అవసరమైనటువంటి ఎక్కువ పేజీలను అందించే వారని రాష్ట్రంలోనే మొదటిసారిగా 24 పేజీల బుక్లెట్ తో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలతో పాటు మంచి నీటిని నిరంతరం విద్యార్థులకు అందించడం జరుగుతుందని, పదో తరగతి హాల్ టికెట్లతో ఆర్టిసి బస్సు ప్రయాణం ఉచితంగా చేయవచ్చునని విద్యార్థులకు తెలియజేశారు. పరీక్ష కేంద్రానికి అందరూ గంట ముందు చేరుకోవాలని ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉంటే అక్కడ పరిస్థితులను బట్టి 30 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతిస్తామనన్నారు. పదో తరగతి పరీక్షలకు 3,703 మంది ఉపాధ్యాయులను నియమించామని, 15 మంది స్క్వాడ్ సిబ్బంది నిరంతర పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తూ ఉంటారన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ సాధారణ దుస్తులతో పరీక్ష కేంద్రాలకు హాజరవ్వాలని,
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆర్.జే.డి మధుసూదన్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఈ.వో సుభద్ర తదితరులు పాల్గొన్నారు.