కమిషనర్
-నిర్యాహకులకు రూ. 10 వేలు జరిమానా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ , విశ్వం వాయిస్ః
రాజా ట్యాంక్ పార్క్, స్విమ్మింగ్ పూల్ నిర్వహణ తీరు పై నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్. నాగ నరసింహారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన రాజాట్యాంక్ పార్క్ ను సందర్శించి అక్కడి స్విమ్మింగ్ ఫూల్ పనితీరును, నీటిని శుద్ధి చేసే విధానాన్ని, ఇతర అంశాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదివారం స్విమ్మింగ్ పూల్ సందర్శించి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కమిషనర్ సోమవారం అక్కడికి వెళ్లి వాస్తవ పరిస్థితిని ఆరా తీశారు. నిర్వాహకుల తీరుపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్విమ్మింగ్ పూల్ నిర్వాహకునికి రూ 10,000 జరిమానా విధించారు. అలాగే పార్కు నిర్వహణ తీరుపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్కు నిర్వహిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్కు 25% పెనాల్టీ వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించాల్సిన పార్కు లో నిర్వహణా లోపం కనిపించిదన్నారు. స్విమ్మింగ్ పూల్ తోపాటు పార్కు నిర్వహణను మెరుగుపరిచి ప్రజలకు ఉపయోగపడే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ఎం హెచ్ ఓ డాక్టర్ పృద్వి చరణ్, డిఈ సుబ్బారావు, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్ తదితరులు ఉన్నారు.