ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి
– జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం ,విశ్వం వాయిస్ః
ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన ప్రతి లక్ష్యం ఆయా శాఖలు సాధించేందుకు తగిన ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం డ్వామా, సర్వే, మెడికల్, భూసేకరణ, స్పందన, విద్యా, హౌసింగ్, రెవెన్యూ తదితర శాఖలతో మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, ప్రతి 15 రోజులకు సిఎం జిల్లా ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి జిల్లా సమీక్ష సమావేశం కి పూర్తి స్థాయి నివేదికలు, యాక్షన్ ప్లాన్ తో హాజరు కావాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పని దినాలు లక్ష్యాలు మించి ఫలితాలు సాధించాలన్నారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాటశాలల్లో, ప్రభుత్వ ఆసుపత్రులలో, వైద్య విధాన పరిషత్ లలో చేపడుతున్న పనుల లక్ష్యాలు, ప్రగతిపై సమీక్షించారు. సచివాలయ , అర్భికేలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాలు పై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ . శ్రీధర్ భూ సంబంధ అంశాలపై సమీక్ష చెయ్యగా, డిఆర్ఓ బి. సుబ్బారావు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, వైద్య, విద్యా, ఆర్డబ్ల్యుఎస్, పిఆర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.