Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పిడుపాటుకు గురై ఎంపిటిసి శ్రీదేవి దుర్మరణం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– నివాళులు అర్పించిన తెదేపా నేతలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఏటపాక:

 

ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ : మండలంలోని తోటపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పిడుగు పడిన నేపథ్యంలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. ఇంటి వెనుక పని చేస్తున్న త్రిపుర పెంటవీడు ఎంపిటీసి చుండ్రు శ్రీదేవి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఎంపిటీసి శ్రీదేవికి భర్త మల్లేశ్వరరావు , కుమారుడు , కుమార్తె ఉన్నారు. ఎంపిటీసి శ్రీదేవి మరణవార్త తెలుసుకున్న అరకు పార్లమెంట్ తెదేపా అధికార ప్రతినిధి మువ్వ శ్రీనివాస్ , అరకు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు కనూరి బుల్లయ్య , విస్సాపురం మాజీ ఎంపిటిసి నిడదవోలు సూర్యనారాయణ చౌదరి , తెదేపా నాయకులు బొల్లా పుల్లయ్య ఎంపిటీసి శ్రీదేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎంపిటీసి శ్రీదేవి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంపిటీసి శ్రీదేవి మృతితో తోటపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement