Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పట్టణ మంచినీటి అభివృది పధకం అమలు ఇంకెన్నాళ్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

 

ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్,

మంగళవారం 26వ తారీఖున ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నగర పార్టీ సమావేశానికి నగర పార్టీ అధ్యక్షులు దొమ్మేటి రమణ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మిడివరం మున్సిపల్ కౌన్సిల్ ఈ ప్రభుత్వంలో ఏర్పడి సంవత్సరకాలం అయినను నగర పంచాయతీ కి ప్రభుత్వం నుండి ఏ విధమైన నిధులు సమకూర్చ కుండా గత ప్రభుత్వంలో మంజూరైన నిధులను వినియోగించి అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో చాలా వెనుకబడి ఉన్నారని, ఉదాహరణకు ఫిబ్రవరి నెల 2019 సంవత్సరంలో గత ప్రభుత్వం హయంలో మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చి బాబు గారి సహకారంతో ఏ ఐ ఐ బి (ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్) సంస్థ ద్వారా పట్టణ మంచినీటి పథకం కింద 111.35 కోట్లు నిధులు సాంక్షన్ చేయించి సదరు పట్టణ మంచినీటి అభివృద్ధి పథకం ద్వారా నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డు లోని ఇండ్లకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు తయారు చేసి మరియు పల్ల స్వామి చార్టీస్ నుండి ప్రభుత్వం సేకరించిన 20 వార్డు లోని గురుకుల పాఠశాల వెనక ఉన్న 6 ఎకరాల భూమిని 6 ఎం ఎల్ డి ఫిల్టర్ రేషన్ ప్లాంట్ నిర్మించుటకు నిధులు మంజూరు చేసి 19 /02 /2019 న అప్పటి హోం శాఖ మాత్యులు మరియు విపత్తుల నిర్వహణ శాఖ మాత్యులు అయిన నిమ్మకాయల చినరాజప్ప గారిచే అప్పటి శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు అప్పటి నగర పంచాయతీ చైర్ పర్సన్ చెల్లి శాంతి కుమారి అశోక్ గార్లు శంకుస్థాపన చేయుచున్నారు కానీ సార్వత్రిక ఎన్నికల కోడ్ నిబంధనలు వలన నిధులు మంజూరు అయి ఉండి టెండర్లు పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ వలన పని జరిగి ఉండలేదు.
ఎన్నికల అనంతరం 2019 మే నెలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ సదరు పట్టణ మంచినీటి సరఫరా పథకం ను అమలు చేయడంలో ప్రభుత్వం మరియు యోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు విఫలమయ్యే ఉన్నారని ఇప్పుడు అనగా మూడు సంవత్సరాల కాలం దాటిన తర్వాత 2019లో మంజూరైన నిధులు వేరే పథకాలకు ఉపయోగించి కొనటానికి ఏ ఐ ఐ బి సంస్థ ఒప్పుకో నందున ఇప్పుడు సదరు 111.35 కోట్లు గ్రాంట్ కొత్తగా వైయస్సార్ సిపి నాయకులు వారి ప్రభుత్వం నుండి మంజూరు తెచ్చినట్లు గా డాంబికాలు పలుకుతున్నారు జగన్ ప్రభుత్వానికి అభివృద్ధి పనులు చేయటం చేత కానందు నే ఈ మంచినీటి పథకం పనులు అమలు చేయటం మొదలు పెట్టడానికి నిధులు సమృద్ధిగా ఉన్నను మూడు సంవత్సరాల కాలం పట్టిందని ఆయన విమర్శించారు.
ఈ సమావేశంలో అమలాపురం పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ మరియు 5 వార్డ్ కౌన్సిలర్ ముళపర్తి బాలకృష్ణ, కౌన్సిలర్స్, నాయకులు, దివి మహాలక్ష్మి, అడబాల సతీష్ కుమార్, కట్ట సత్తిబాబు, మాదాల నాగ సత్య మంగ కుమారి, కడలి సౌజన్య నాగు, విల్ల వీరస్వామి నాయుడు, జగత గోవిందరావు, రెడ్డి సుధీర్, పితాని నరసింహమూర్తి, పిల్లి నాగరాజు, గొల్లపల్లి గోపి, నడింపల్లి శ్రీనివాస రాజు, దాట్ల బాబు, బొక్క రుక్మిణి, మెండీ కమల, పెదపూడి రుక్మిని, వాసంశెట్టి అమ్మాజీ, కుడుపూడి మల్లేశ్వరి, కాశి లాజర్, కాకి మాణిక్యం, చౌదరి, ఎస్ ఎం ఎస్ ప్రసాద్, మెండీ కృష్ణ బాబు, బడుగు సందీప్ సాయి, పెదబాబు, గడ్డం శ్రీనివాసరావు, రెడ్డి శ్రీను, కాండ్రేగుల శేషగిరి రావు, చింతపల్లి రాజు, రెడ్డి బాలకృష్ణ, మొదలగు వారు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement