కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దాడిశెట్టి రాజా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:
తొండంగి: ఏప్రిల్ 26: విశ్వం వాయిస్ న్యూస్: కాకినాడ జిల్లా
తొండంగి మండలం,తొండంగి మండల పరిషత్ కార్యాలయం వద్ద
ఈరోజు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం వాలంటీర్ల ప్రజా నోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా విచ్చేసినందుకు ప్రజలు, మహిళలు, వైఎస్ఆర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మంత్రివర్యులు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ వాలంటీర్లని మనకు చక్కగా సహకారం అందిస్తున్న వాలంటీర్లు సన్మాన కార్యక్రమానికి ఇంతమంది కూడా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులుగా మనలో భాగం అయిపోయారని మంత్రి రాజా తెలియజేశారు. అనంతరం డ్వాక్రా మహిళలకు వైయస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ మంజూరు ఒక కోటి 24 లక్షల రూపాయలు చెక్కును మంత్రి రాజా చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా మండల గ్రామ వాలంటరీల1. ఏ. కొత్తపల్లి గ్రామం నుంచి కామిరెడ్డి భూలక్ష్మి,2. కోదాడ-2 గ్రామం నుంచి యనమల నాగమణి, 3. కృష్ణాపురం గ్రామం నుంచి నరవ చిన్న నానాజీ, 4. పి.ఈ చిన్నాయి పాలెం నుంచి కొమ్ముల మల్లేశ్వరరావు,5.రావికంపాడు గ్రామం నుంచి బత్తుల ఆంజనేయులుకి స్టేజిపైకి ఆహ్వానించి మంత్రి రాజా చేతుల మీదుగా శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో తుని మార్కెట్ చైర్మన్ కొయ్య మురళీకృష్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత ఆనందహరి, లోవ దేవస్థానం చైర్మన్ బొంగు ఉమా రావు, మండల ఎంపీపీ అంగులూరి అరుణ్ కుమార్, వైస్ ఎంపీపీ నాగం గంగ బాబు, వైస్ ఎంపీపీ యాదాల రమణ, ఎంపీడీవో పి. సతీష్, తాసిల్దార్ కె. కీర్తి, మండల ఎంపీటీసీలు, మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఏపిఎం వై. సత్తిబాబు, అన్ని శాఖల డిపార్ట్మెంట్ అధికారులు, వాలంటీర్ల సిబ్బంది.డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.