పోలీసులు వెంటనే అరెస్టు చెయ్యాలి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట: మండపే ట గోశాలలో పవిత్ర గోమాతలపై దాడులకు పాల్పడ్డ దుండగులను పోలీస్ లు వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని మారుతీ మానస పీఠాధిపతులు మారుతీ మహానందస్వామి డిమాండ్ చేశారు. మండపేటలోని మీడియా తో ఆయన ఫోన్ లో మాట్లాడుతూ మూగ జీవాలపై దాడికి పాల్పడటం పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ప్రతి హిందువు గోమాతను కన్న తల్లిగా భావిస్తారన్నారు. అటువంటి గోమాతను బాధించడమంటే హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీయడమేనన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ లు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.