విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్): సేవా దృక్పథానికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి దేశం మొత్తాన్ని రాష్ట్రం వైపు చూసే విధంగా వీరి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను గడప గడపకూ చేరవేస్తూ పారదర్శకంగా సేవలందిస్తున్న గ్రామ వలంటీర్ల నిబద్ధతను గుర్తిస్తూ వారిని సేవా పురస్కారాలతో సత్కరించే కార్యక్రమం బుదవారం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామ పంచాయతీ వద్ద జరిగింది. ఎంపీడీవో జేఏ ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. మండలంలో 480 మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తుండగా వీరిలో నర్సిపూడికి చెందిన తాతపూడి భాగ్యవతికి సేవావజ్రగా పురస్కారం అందించి ముప్పై వేలరూపాయల నగదు బహుమతి, పట్నాల సువర్ణలత (చెముడులంక 1), చందన వెంకటలక్ష్మి (మడికి 1), కొవ్వూరి శ్రీదేవి (నర్సిపూడి) లకు సేవారత్న పురస్కారంతో పాటుగా ఇరవై వేల రూపాయల నగదు పురస్కారం అందిశారు. మిగిలిన వారందరికీ సేవా మిత్ర పురస్కారాలతో సత్కరించి పది వేల రూపాయలు చొప్పున అందించి దుశ్శాలువకప్పి ఘనంగా సత్కరించి ప్రోత్సాహక నగదు బహుమతులతో బ్యాడ్జీలను ఎమ్మెల్యే చిర్ల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవచేసేందుకే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. అలాంటి వాలంటీర్లు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అదే విదంగా స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు అందించాలని సూచించారు. మరోవైపు వాలంటీర్లకు సత్కారాలు చేస్తుంటే కొందరు ఓర్వలేక పోతున్నారని వారి సేవలకు ప్రభుత్వం చేస్తున్న చిరు సత్కారం కోసం పెడుతున్న ఖర్చు వృధా అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను నిస్వార్థంగా ప్రజల ముంగిట అందిస్తున్న వాలంటీర్లు నిస్వార్ధ సేవకులని వారిని ప్రోత్సహించడం కోసం పెట్టె ఖర్చును తప్పు బట్టడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాసు, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, ఏఎంసీ చైర్మన్ తమన సుబ్బలక్ష్మి, జెడ్పిటిసి సభ్యురాలు తోరాటి సీతా మహాలక్ష్మి, సర్పంచులు దంగేటి చంద్రకళ బాపనయ్య, గుణ్ణం రాంబాబు, నేలపూడి లావణ్య, సుంకర కామరాజు, దియ్యన పెద్దకాపు, యు సుందర విజయం, తాసిల్దార్ లక్ష్మీపతి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పోసమ్మ, హౌసింగ్ ఏఈ జేజిబాబు, మండపేట విద్యుత్ శాఖ ఏడిఈ తిరుమలరావు, మండల ప్రజా పరిషత్ పరిపాలన అధికారి టీవీ సురేందర్రెడ్డి పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.