విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయస్ న్యూస్)
పి. గన్నవరం మండల పరిధిలోని పలుగ్రామాలలో జగనన్న గృహ పథకం ద్వారా ఓ టి ఎస్ నమోదు చేయించుకున్న 20 మంది లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలు అందజేసిన ఎంపీడీవో ఐ.ఇ.కుమార్ తెలిపారు.ఈ మేరకు ఆయా గ్రామాలలోఆయన పర్యటించి లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ టి ఎస్ నమోదు చేసుకునేందుకు ప్రజలందరూ ఆసక్తి చూపాలని కోరారు. ఓ టి ఎస్ నమోదు చేయించుకోవడం ద్వారా గృహాలపై వారికి సర్వ హక్కులు కల్పించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమణ, డిజిటల్ అసిస్టెంట్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.