విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట: ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా గా చేరువ చేయడంతో పాటు తన పరిధిలోని ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన 25వ వార్డు వాలంటరీ ఎండి ముసా కరీముల్లా అందించిన సేవలకు ప్రతిఫలమే వజ్ర సేవ అవార్డు అని పోస్ట్మాస్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.తమ ఉద్యోగి ఎం డి ఎం షరీఫ్ కుమారుడైన ఎండి కరీముల్లా శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు ద్వారా అవార్డు అందుకున్న సందర్భంగా బుధవారం స్థానిక తపాలా కార్యాలయం ఉద్యోగులంతా కరీం ను ఘనంగా సత్కరించారు.
పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ మండపేట ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొండపల్లి సూర్యనారాయణ, బి సీతామహాలక్ష్మి, ఎం డి ఎం షరీఫ్, కే అనూష, వి శ్రీనివాసరావు టాపా ఫుల్లే శ్వరరావు లు పాల్గొన్నారు.