Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మంత్రి ఇలాఖ లో భూకబ్జా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– 15 మంది కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ ఎదుట ఆందోళ
– రాజకీయ నాయకులకు తొత్తులుగా మారినా పోలీసులు
– పురుగుల మందుతో ఆత్మహత్యాయత్నానికి
ప్రయటనించిన మహిళ
– సకాలంలో స్పందించిన ఔట్ పోస్ట్ పోలీసులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని:

 

కాకినాడ , విశ్వం వాయిస్ః

పోలీసులే దగ్గరుండి తమ సొంత భూమిలో కంచెలు వేయించి దురాక్రమణ దారులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తు తుని మండలం కె.ఓ.మల్లవరంకి గ్రామానికి చెందిన సుర్ల కొండలరావు కుటుంబ సభ్యులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.తుని మండలం కె.ఓ.మల్లవరం గ్రామానికి చెందిన రైతు సుర్ల కొండలరావుకు రాంబాబు, భరత్ బాబు, శత్రుబాబు,అనే ముగ్గురు కుమారులు, అనిమిరెడ్డి శాంతి అనే కుమార్తె ఉన్నారు. కొండలరావు గత ఏడాది చనిపోగా అతనికి దొండవాక గ్రామంలో 9వ సర్వేనెంబర్ లోని భూమిలో 8 ఎకరాల 86 సెంట్లు తమ సొంత భూమిని కబ్జా చేసేందుకు అదే గ్రామంలోని మునసిబు కుమారులు నల్లబిల్లి గణేష్, నూకరాజు, విజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేశారు.ఈ అంశం పిఠాపురం కోర్టు పరిధిలో ఉండగా గణేష్, నూకరాజు, విజయ్ లు మంగళవారం తమ భూమిలో 4ఎకరాలు మేర కంచెలను అక్రమంగా ఏర్పాటు చేశారని అన్నారు. వారిని ఈ అంశంపై నిలదీయగా ముప్పై మంది పోలీసులు తమ ఇంటికి వచ్చి తమ ఆడవారితో సహా అందరినీ మంగళవారం ఉదయం పోలీసులు స్టేషనుకు తరలించి అర్ధరాత్రి సమయంలో విడిచిపెట్టారని ఆరోపించారు.దీనితో కలత చెంది బుధవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట10మంది ఆడవాళ్లు,5గురు మగవారు తరలివచ్చారు. న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు.కోర్టులో కేసు ఉంటుండగా తమపై దాడికి యత్నించారని అన్నారు. వీరి వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఓ మహిళ పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా కలెక్టరేట్ ఔట్ పోస్ట్ పోలీసులు త్వరితగతిన స్పందించి బాటిల్ లాక్కున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దీనితో పోలీసులు ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను కలిసి బాధిత కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement