విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ , విశ్వం వాయిస్ః
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏలూరి సుబ్రమణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు రోజులపాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగించగా, చివరి రోజు అధ్యక్ష పదవికి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏలూరు సుబ్రమణ్యాని అధ్యక్ష పదవి మరల వరించింది. కొన్ని పదవులు ఏకగ్రీవం అవ్వగా మరి కొన్ని పదవులుకు పోటీ ఏర్పడింది. ట్రెజరర్ గా గంగు మళ్ళ శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఎడ్ల కుటుంబరావు, లేడీ కమిటీ మెంబర్ గా గండికోట కళ్యాణి, సూపర్ సీనియర్ కమిటీ మెంబర్ లగా సయ్యద్ సాలార్, కే వి ఎస్ ఎన్ మూర్తి, కమిటీ మెంబర్ లగా కే లక్ష్మీనారాయణ, స్వామి, శ్రీదేవి, రామారెడ్డి, పదవులకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఈ పదవులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. కార్యదర్శి పదవికి శంకు సింగ్ ఓబుల శెట్టి సత్యనారాయణ పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్ష పదవికి కె వి భద్ర రావు, ప్రతాప్ కుమార్, రామచంద్ర రాజులు మధ్య పోటీ ఏర్పడింది. జాయింట్ సెక్రెటరీ కి సుధన శ్రీనివాస్, టీ ముసలయ్య మధ్య పోటీ ఏర్పడింది. లైబ్రరీ సెక్రటరీకి వెలిగొట్ల శ్రీనివాస్ హేమంత్ రెడ్డి తలపడుతున్నారు. లేడీ రిప్రజెంటేటిగా ఉమా మహేశ్వరి, వసంత పోటీలోకి దిగారు. మే 6వ తేదీన పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికలు నిర్వహిస్తారు. రేపు స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేసి బరిలో నిలిచింది ఎవరు అనేది ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 29, 30 తేదీల్లో ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా తుమ్మలపల్లి చంద్రశేఖర్ వ్యవహరిస్తుండగా, అసిస్టెంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా బచ్చు రాజేష్, ఎన్నికల అధికారులుగా కె.వి.వి చలపతి, కంబాల శ్రీధర్, ఆర్.బి.షా వ్యవహరిస్తున్నారు.