WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

” సిండికేట్లు సెటిల్మెంట్లకు పెట్టిందిపేరు తోట త్రిమూర్తులు”

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
సిండికేట్ లు, సెటిల్మెంట్లకు పేరెన్నికగన్న తోట త్రిమూర్తులు తాము సిండికేట్ వ్యాపారం చేసామనడం హాస్యాస్పందంగా ఉందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేగుళ్ల పాల్గొని మాట్లాడారు.

తోట చేసిన తప్పులను కప్పి పుచ్చుపుచ్చుకోవడానికి తమపై కావాలనే బురద జల్లుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా వున్నప్పుడు తోట తన సిండికేట్ తో కపీలేశ్వరపురం ఇసుక ర్యాంపుల్లో 60 శాతం వాటా తీసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. తను కోరుమిల్లి వద్ద ఆందోళన చేసిన సమయంలోనే లారీలను విడిచి పెట్టేయాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. తాను పిర్యాదు ఇచ్చిన అనంతరం అక్కడ లారీ యజమానులు ర్యాంపు లోనే ఉన్న తమ వద్దకు వచ్చి వేబిల్లులు కూడా ఇవ్వడం తో ర్యాంపుకు అనుమతులు ఉన్నాయని నమ్మి తాము ఇక్కడకు రావడం జరిగిందని వాపోవడం జరిగిందన్నారు. అసలే కరోన ప్రభావంతో తీవ్ర నష్టాల్లో ఉన్న తమను కరుణించాలని ప్రాధేయపడటంతో, వారి ఆవేదనలోనూ న్యాయం ఉండటం తో అక్కడే అధికారులకు లారీలు విడిచిపెట్టేయాలని సూచించడం జరిగిందన్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యులు ఆ రోజు తనతో పాటు ఉన్న మీడియానేనని పేర్కొన్నారు. తప్పుడు వేబిల్లులు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేసింది వేరొకరు కావడంతో తానే లారీలను విడిచిపెట్టేయాలని సూచించడం జరిగిందన్నారు. అది నిజం కాకపోతే నిజంగానే జేపీ వెంచర్స్ ఉద్యోగి సుధాకర్ రెడ్డి ని తాను డబ్బులు అడిగి ఉంటే అది నిజమని తోట ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. తాము కోరుమీల్లిలో ధర్నా చేస్తున్న సమయంలో అదే గ్రామంలో వాలంటీర్ల సత్కార సభ నిర్వహిస్తున్న తోట ఆవేశంతో రెచ్చిపోతూ తెల్లారేసరికి మా ర్యాంపులను తెరిపించుకుంటామని ప్రగల్భాలు పలికిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు ఎవరో చేసిన తప్పుడు ఇసుక అక్రమాలకు తానేందుకు సమాధానం చెబుతానని బుకాయిస్తున్నారని, కానీ ఆ రోజు బహిరంగ సభలో దమ్ముంటే మా ర్యాంపు లు తెల్లారేసరికల్లా తెరవకుండా అడ్డుకోవాలని ఎందుకు సవాళ్లు విసిరారని ప్రశ్నించారు. ఆ వీడియో గాని తమకు దొరకపోతే తోట ఇంకెన్ని పిట్ట కదలు చెప్పేవారోనని ఎద్దేవా చేశారు. అందుకు సంబంధించి తోట మాట్లాడిన వీడియో లను మీడియాకు చూపించారు. అదే విధంగా తాను అడిగిన అనేక ప్రశ్నలకు తోట సమాధానం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఎన్ఠీఆర్, చంద్రబాబు విషయంలో తోట చంద్రబాబు పక్కనే ఉన్న విషయం వాస్తవం కాదా అని అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదన్నారు. చంద్రబాబు వెన్నెపొటు దారుడే అయ్యుంటే నాలుగుసార్లు ఆయన దగ్గర నుండి టికెట్ ఎందుకు తెచ్చుకున్నారని తాను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదన్నారు. అందుకే తాను తోట ను రేవు దాటాక తెప్ప తగలేసే రకం అంటుంటానని మరోసారి వ్యాఖ్యానించారు. అదే విధంగా తను టిడ్కో ఇళ్లకోసం ప్రశ్నిస్తే నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. వీటితో పాటు తాను అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా శంఖుస్థాపన లు చేశానని తోట తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారికి నిజంగా సత్తా ఉంటే ఒక్కటైన అటువంటి శంఖుస్థాపన ను చూపించాలని సవాల్ విసిరారు. వారు అడిగిన శంఖుస్థాపన కు అరగంటలో అనుమతి పత్రాలు చూపించగలని పేర్కొన్నారు. ఆత్మ హత్యలు చేసుకున్న ముగ్గురు బీసీ రైతులకు నష్ట పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే దానికీ అతి గతి లేదన్నారు. అదే విధంగా తోట ఎప్పుడూ అధికార పార్టీలోనే ఉంటారని తాను పేర్కొనగా అందుకు సమాధానంగా తోట తన కాళ్లు టీడీపీ నాయకులు పట్టుకోకుండా చూసుకొండని చెప్పడంలో ఆయన ఉద్దేశ్యాలు అర్ధమవుతున్నాయన్నారు. తాను తెలుగుదేశం పార్టీలోకి రావడం ఖాయమని తోట తన నైజాన్ని బయట పెట్టారన్నారు. ఈ సమావేశంలో 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం, మండపేట నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మందపల్లి దొరబాబు, మాజీ కౌన్సిలర్ బండి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement