విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ముమ్మిడివరం విశ్వం వాయిస్ న్యూస్,
సమాజంలో అసమానతలు రూపుమాపి సమసమాజ స్థాపనే లక్ష్యమని చదువు ద్వారానే జ్ఞానం ద్వారా ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చని జిల్లా సివిల్ సప్లై అధికారి కె వి ఎస్ ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు.
గురువారం కోమనపల్లి మొల్లి వారి పేట లో అంబేద్కర్ 131వ జయంతి సభలో ఆయన మాట్లాడారు సభకు కాశి మూర్తి అధ్యక్షత వహించారు,
మరో ముఖ్య అతిథి పెయ్యాల పరశురాముడు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ దేశాలు చేత గొప్ప మేధావి అని ఈ దేశంలో కుల పునాదుల మీద ఒక నీతిని గాని ఒక జాతిని గాని నిర్మించలేము అని ఆనాడే అంబేద్కర్ చెప్పారు, అంబేద్కర్ తన కుటుంబాన్ని వదులుకొని జాతి ఉన్నతి కై పాటుపడిన మహానుభావుడు అని అన్నారు. నాకు విగ్రహాలు పూలదండలు కాదు పుస్తకాలు చదవండి అంబేద్కర్ చెప్తే ఇప్పుడు ఉన్న యువత అంబేద్కర్ జయంతి పేరుతో యువత తప్పుదారి పడుతుందని అన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం తహసిల్దార్ పోతురాజు, ఎంపీడీవో కే భీమేశ్వరరావు, సచివాలయం కార్యదర్శి లక్ష్మి, స్థానిక సర్పంచ్ కాశి ఇందిరా, ఎంపీటీసీ సభ్యులు సుబ్రహ్మణ్యేశ్వరి, కుంచనపల్లి బాబులు, కుంచనపల్లి, నాతి కుమార్, మొల్లి సత్తిబాబు, మొల్లి రాంబాబు, మోల్లి వెంకన్న, మోళ్లి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.