Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

” రైతులకు పలు యంత్రాల పంపిణీ”

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రావులపాలెంలో దబ్సిడీపై రతులకు పవర్ టిల్లర్లు, పవర్
వీడర్ పంపిణీ చేసిన పర్సబుత్వ విప్ చిర్ల

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం(విశ్వం వాయిస్) వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల కొరకు ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని, ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వమే యూరియా, పురుగు మందులు, విత్తనాలు తక్కువ ధరకు రైతులకు అందచేయడం జరుగుతుంది అని, వై.యస్.ఆర్.రైతు భరోసా ద్వారా రైతులకు 13,500 రూపాయలు అందచేస్తున్నారని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పంట నష్టం సంభవిస్తే రైతులకు అదే సంవత్సరంలో పంటల భీమా ద్వారా నష్ట పరిహారం అందిస్తున్నారని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
రావులపాలెంలో జరిగిన కార్యక్రమంలో వై ఎస్ ఆర్ యంత్ర సేవా పథకం క్రింద ప్రతి ఆర్ బి కే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సి హెచ్ సి )ద్వారా రైతులు గ్రూపుగా ఏర్పడి అవసరమైన యంత్ర పరికరములను ఆయా ఆర్ బి కే ల పరిధిలో అద్దెకు ఇచ్చి రైతులకు అందుబాటులో ఉంచుటకు గాను వైఎస్ఆర్ సేవా కేంద్రాలుగా ఆర్ బి కే లు పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ఏర్పాటు చేశారని, అందులో భాగంగా ఈరోజు రావులపాలెం మండల పరిధిలో 5 సి హెచ్ సి లకు 18కృషి ట్రాక్టర్లు (పవర్ టిల్లర్లు), ఒక పవర్ విడర్ రైతులకు స్థానిక శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు.
ఒక కృషి ట్రాక్టర్ పూర్తి ధర 1,86,000. రైతు కట్టవలసిన 93,000 సబ్సిడీ ధర 70,000 బ్యాంకు లోను 93,000.
మొత్తం 18 కృషి ట్రాక్టర్ల ఖరీదు 34,52,000
సబ్సిడీ ధర 13,16,000
రైతు కట్టవలసిన 17,26,000
బ్యాంకు లోను 17,26,000.
అదేవిధంగా రోటవేటర్ లు, స్ప్రేయర్లు వంటివి కూడా రైతులకు అందుబాటులో ఉన్నవని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ప్రభుత్వం ట్రాక్టర్లు కూడా సబ్సిడీ మీద అందుబాటులోనికి తీసుకుని వచ్చింది అని, 40 శాతం రాయితీ మీద అన్ని కంపెనీల ట్రాక్టర్లు సి హెచ్ సి ల ద్వారా అందజేయబడును అని మండల వ్యవసాయ అధికారి మీనా తెలియచేసారు….

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement