– మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ చేతుల మీదుగా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
అగ్ని ప్రమాద బాధితులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేయూతను అందించారు. ఎటపాక మండలం గన్నవరం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 6 నిరుపేద కుటుంబాలు సర్వం కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం జనసేన పార్టీ కార్యకర్తలు బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల నగదుతో పాటు దుస్తులు అందజేశారు. ఈ సందర్బంగా జనసేన మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు ప్రతి ఒక్కరూ సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసంతాల హస్వీత్ బొల్లు నాగసాయివర్ధన్ , జాస్తి సత్యనారాయణ , ములిశెట్టి శివాజీ , ప్రేమ్ చంద్ , పాయం ముద్దరాజు , మందా సుబ్రహ్మణ్యం , స్వామి తదితరులు పాల్గొన్నారు.