విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్ )
పి.గన్నవరం మండలం లోని లంకలగన్నవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నిత్యం భక్తుల పూజలందుకుంటున్నారు. ఈ మేరకు గ్రామంలోని వేమన వారి పాలెం కు చెందిన వేమన సత్యనారాయణ కుటుంబ సభ్యులు అమ్మవారికి రూ.20 వేల విలువచేసే వెండి రాళ్ల గాజులు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు కుంకుమ పూజలు నిర్వహించి, గాజులను అలంకరించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గనిశేట్టి గణపతి, మాజీ చైర్మన్ వేమన రామకృష్ణ, భద్రాద్రి సీతా రామాలయం చైర్మన్ వేమన సత్తిబాబు, గ్రామస్తులు వేమన నాగబాబు, శృంగవరపు బాబి, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.