Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

“అనుకున్నది వాకటి అయినది మరొకటి””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

"ప్రశాంతంగా సాగిన కౌన్సిల్ సమావేశం"

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
ఇటీవల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాస గా మారడం ఖాయమని అంతా భావించారు. దీనికి తోడు ఎప్పుడూ లేని విధంగా పట్టణ పోలీస్ లు కౌన్సిల్ సమావేశానికి రావడం ఆనుమానాలకు మరింత ఆజ్యం పొసినట్లైంది. అయితే రాజకీయాలంటేనే ఎవరూ ఊహించనివి చూడాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు కదా. ఒకరినొకరు కాలర్ పట్టుకునే స్థాయిలో వాదోపవాదనలు జరుగుతాయనుకుంటే ఇప్పటి వరకు ఏ సమావేశం జరగనంత ప్రశాంతంగా, ఏవో ఒకటి రెండు ఘటనలు మినహా కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా సాగింది. దీంతో అందరూ అవాక్కై ఎంతైనా రాజకీయాలంటేనే ఇంతనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు.

మండపేట మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్య భవాని మాట్లాడుతూ టిడ్కో ఇళ్లకు సంబంధించి కొందరిని అనర్హులుహ నిర్ధారించడం జరిగిందని, అయితే వారు కట్టిన లక్ష రూపాయలు వెనక్కి ఇచ్చే అవకాశం పరిశీలించాలని కోరారు. దీనికి ఎమ్మెల్సీ తోట సమాధానం ఇస్తూ ప్రభుత్వం తో మాట్లాడి ఇటువంటి సమస్యలకు పరిస్కార చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే టిడ్కో ఇళ్ళు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే వేగుళ్ల సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ నిన్ననే హౌసింగ్ కి సంబంధించి ఉన్నతాధికారులతో సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగిందని, మరో రెండు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కౌన్సిలర్ చుండ్రు చిన సుబ్బారావు చౌదరి మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్ అద్వాన్నంగా ఉందని, రెండు, మూడు రోజులకోసారి డ్రైన్ లను శుభ్రం చేస్తున్నారని ఆరోపించారు. ఏమైనా అడుగుతుంటే సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారని ఆరోపించారు. పైగా బ్లీచింగ్, ముగ్గు వంటి వాటి పేర్లే మర్చిపోయారని, అస్సలు చల్లడం లేదని మండిపడ్డారు. కాగా టౌన్ ప్లాఆ లనింగ్ కి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై అధికారులు కౌన్సిల్ సభ్యులకు అవగాహన కల్పించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement