ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ముమ్మిడివరం – విశ్వం వాయిస్ న్యూస్:
వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వెంకట కుమార్ తెలిపారు.
ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ లో ఐ.పోలవరం మండల కన్వీనర్ వెంకటపతిరాజు (శ్రీనురాజు) ఆధ్వర్యంలో వాలంటీర్లకు పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు ఇచ్చి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల వద్దకే వెళ్లి ప్రజలకు వివిద రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో వాలంటీర్లు చేసిన సేవలు అమోఘం అని వారిని కొనియాడారు. అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే అందిస్తున్న వాలంటీర్లకు సీఎం జగన్ అందిస్తున్న చిరుసత్కారం ఇదని ఆయన అన్నారు. ఐ పోలవరం మండలం జడ్పిటిసి అభ్యర్థి ముదునూరి సతీష్ రాజు కాన్ఫరెన్స్ హాల్లో చివరి వరసలో కూర్చున్న వారికి ఇబ్బంది లేకుండా ఐ. పోలవరం మండలం జడ్పిటిసి అభ్యర్థి ముదునూరి సతీష్ రాజు స్క్రీనింగ్ వీడియోలు ఏర్పాటు చేసి, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ.పోలవరం మండలం జడ్పిటిసి ముదునూరు సతీష్ రాజు, ఢిల్లీ నారాయణ, హితకారిణి సమాజం చైర్మన్ కాశి బాల ముని కుమారి, వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ వాసురాజు, ఎంపిడిఒ ఎస్. మధుసూధన్, ఆయా గ్రామాల సర్పంచులు, సెక్రటరీలు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.