విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
ఒక పక్కా గ్రామ సచివాలయం శిధిలాలకి చేరినా పరిస్థితి ఉన్న సరే కొత్త సచివాలయం పనులు నత్తనడకన సాగటం విశేషం.పూర్తి వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో పరిస్థితి ఈ విధంగా ఉంది. వైస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ మొదలు పెట్టి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా సరే ప్రస్తుతం బింమ్లు వేసి ఎవరికి పట్టిపట్టనట్టు ఉన్న పరిస్థితి. ఒక పక్క ఇనుప ఊసులు తుప్పుపడిస్తున్న సరే అధికారులు కు ఏ మాత్రం చలనం లేకుండా పోయంది.ఇలాంటి తుప్పు పట్టిన ఇనుప ఊసులు తో స్లాబు వేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అర్థం కాని పరిస్థితి. పేరుకే శంకుస్థాపన తప్ప పూర్తి అవటానికి మాత్రం ఎన్ని సంవత్సరాలు పడతాయో అని గ్రామస్తులు ప్రతినోటా బలంగా వినిపిస్తున్న మాట ఇది.ఉదాహరణకు గ్రామ సచివాలయంమే దానికి నిదర్శనం. శంకుస్థాపన చేయడం లో చూపించే శ్రద్ధ వైయస్సార్ హెల్త్ క్లినిక్ పూర్తి చేయడంతో చూపించాలని అసలు ఎందుకు ఇంత ఆలస్యం చూపిస్తున్నారో అదికారులు వివరణ ఇవ్వవలసి ఉంది.సచివాలయo అధికారులకు వివరణ కోరడనికి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఆన్సర్ చేయకపోవడం గర్హనీయం.