Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చేలా రేగిపోతున మట్టి ఇసుక మాఫియా అరికట్టాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

" కోనసీమలో అరాచక సంస్కృతి అరికట్టాలి–జిల్లా ఎస్పీ
సుబ్బారెడ్డి కి దళిత, ప్రజా, విద్యార్థి,మహిళా సంఘాలు
వినతి"""

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం( విశ్వం వాయిస్)
నూతన జిల్లాగా ఏర్పడిన పచ్చని కోనసీమ లో అరాచక సంస్కృతికి అడ్డుకట్ట వేసి రియల్ ఎస్టేట్ దందా అక్రమార్కులను, మట్టి మరియు ఇసుక మాపియా ను అరికట్టాలని కోరుతూ దళిత బహుజన మహిళా శక్తి, సిపిఎం, వి సి కె పార్టీలు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం. కోనసీమ దళిత ఐక్యవేదిక తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా శుక్రవారం కోనసీమ జిల్లా ఎస్పీ కె ఎస్ ఎస్ వి సుబ్బారెడ్డి ని కలసి వినతి పత్రం అందజేశారు
కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నడిబొడ్డున మూడు రోజుల క్రితం అమలాపురం మండల తహసీల్దార్ (మండల మెజిస్ట్రేట్) వేరే ప్రాంతానికి బదిలీ అయిన సందర్భంగా సాక్షాత్తు మండల మేజిస్ట్రేట్ కార్యాలయం వద్ద కొంతమంది అక్రమాలు చేసే అరాచకవాదులు తాసిల్దార్ బదిలీ పురస్కరించుకొని మందుగుండు కాల్చుతూ మద్యపానం సేవిస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలా సంబరాలు చేసుకున్నారని ఎస్పీకి వివరించారు ఒక అధికారి బదిలీ అయితే ఆ అధికారికి వ్యతిరేకంగా అక్రమార్కులు సంబరాలు చేసుకునే సంఘటనలు బీహార్. మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్. లాంటి రాష్ట్రాల్లో తరచూ జరుగుతూ ఉంటాయి అలాంటి అరాచక సంస్కృతి కి తెరలేపిన దుండగులను గుర్తించి వారిపై చట్టపరమైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఒక దళిత ఉన్నతాధికారి బదిలీ అవడంతో తమ అక్రమాలకు సహకరించలేదనే అక్కసుతో మరియు కులవివక్ష తోనే సంబరాలు జరుపుకున్నారని ఈ సంఘటనలో అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని ఎస్పీకి వివరించారు అక్రమార్కులు సంబరాలు జరుపుకున్న చోటనే అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్.రిజిస్టర్ కార్యాలయం. ఉప ఖజానాసర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇంకా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని అలాంటి చోట అక్రమార్కులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఎస్పీ కి వివరించారు దళిత ఉన్నతాధికారి బదిలీ అయిన సందర్భంగా సంబరాలు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన అక్రమార్కులను గుర్తించి సమగ్ర విచారణ జరిపి సుమోటోగా వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని ఇందులో పాలుపంచుకున్న రెవెన్యూ అధికారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇటువంటి దుస్సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకొని కోనసీమను ప్రశాంతంగా ఉంచాలని కోరారు. కోనసీమలో రియల్ ఎస్టేట్. మట్టి. ఇసుక. నాటుసారా. అక్రమ ఆక్వా చెరువుల మాఫియాలను. సెటిల్మెంట్ల దందాలను. కులపరమైన దాడులు అరికట్టాలని దళితులకు. దళిత అధికారులకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు అనంతరం కోనసీమ జిల్లా మొట్టమొదటి ఎస్పీగా విచ్చేసిన కె ఎస్ ఎస్ వి సుబ్బారెడ్డి కి పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువ కప్పి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజమణి. సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి కారేం వెంకటేశ్వరరావు. పి డి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు. వి సి కె పార్టీ జిల్లా అధ్యక్షులు బొంతు రమణ. కోనసీమ దళిత ఐక్య వేదిక కన్వీనర్ జంగా బాబురావు. కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు. ఉండ్రు బాబ్జి. నక్క సంపత్ కుమార్. ముత్తాబత్తుల శ్రీను. మధుర సంసోను రాజు. తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement