Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 4:55 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 4:55 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 4:55 PM
Follow Us

సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పరిశీలించిన కలెక్టర్ డా. మాధవి లత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమహేద్రవరం (రూరల్) ; విశ్వం వాయిస్ న్యూస్ : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ను ఆదాయ వనరుగా అభివృద్ధి చేయడం పై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తెలియచేశారు.
శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ గ్రామం వెంకటనగర్ లోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, సేంద్రియ వ్యర్థాలతో నిర్వహిస్తున్న ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యంత నాణ్యమైన ఎరువుగా పేర్కొన్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. సరైనమార్కెటింగ్ సౌకర్యం లేదని అధికారులు వివరించారు. మొత్తం జిల్లాలో నిర్వహిస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ద్వారా వస్తున్న ఉత్పత్తి పై సమగ్ర నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మన జిల్లాలోని లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని హార్టికల్చర్ శాఖ ద్వారా వినియోగం లోకి తీసుకుని రావడం జరుగుతుందన్నారు. వీటిని వినియోగంలోకి తీసుకుని రావడం వలన దిగుబడిపెరగడమే కాకుండా ఖర్చుకూడాతక్కువఅవుతుందని తెలిపారు. త్వరలోనే సంబంధించిన శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 60 రోజులకు , రెండు నుంచి మూడు టన్నుల ఉత్పత్తి అవుతోందని వివరించారు.

ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు అందించాలి..
సచివాలయం తనిఖీ చేసిన
…జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత

జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత వెంకటనగర్ సచివాలయాన్ని ఆకస్మింగా తనిఖీ చేశారు. సర్వీస్ రిక్వెస్ట్, ఓటిఎస్ తదితర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల లో లక్ష్యాలను సాధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందన, రెవెన్యూ సంబందించిన అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశించారు.

కలెక్టర్ వెంట డివిజనల్ పంచాయతీ అధికారి జెవి సత్యనారాయణ, తహశీల్దార్ రియాజ్, సెక్రెటరీ స్టీఫెన్, ఇతర అధికారులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement