విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ : మండలం పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం శుక్రవారం ఉదయం జెసి ధ్యాన్చంద్ పరిశీలించారు. రాయవరం, నదురుబాధ , లొల్ల, వి సావరం, సోమేశ్వరం, పసలపూడి, గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న భవనాలు తనిఖీ చేశారు. అనంతరం జెసి విలేకరులతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏడుగురు ప్రత్యేక అధికారులు జరిగిందని, రాయవరం మండలం నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తాసిల్దార్ ప్రకాష్ బాబు, ఎంపీడీవో వి అరుణ, మండల అధికారి ఇంజనీరింగ్ అధికారి రామనారాయణ, ఏవో ప్రభాకర్, సర్పంచులు మల్లిడి సూరారేడి, కాకి కృష్ణ వేణి, వి ఆర్ ఓ లు గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వెలుగు సిబ్బంది తదితరలు ఉన్నారు.