Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యం జాయింట్ కలెక్టర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పారాధర్మకతతో కూడిన ప్రభుత్వ సేవలను ప్రజలకు
అందించడమే లక్ష్యం..
జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అనపర్తి:

 

అనపర్తి, విశ్వం వాయిస్ న్యూస్ : గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం, పారదర్శకతతో కూడిన ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు.
శుక్రవారం అనపర్తి లో సచివాలయం-4 , అర్భికే-4 లను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం దుప్పలపూడి లే అవుట్ లో గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే క్రమంలో గ్రామ స్థాయిలో సచివాలయ, ఆర్భికే లను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. పౌర సేవలు అందించే క్రమంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సచివాలయం లోని వివిధ రీజిస్టర్లను పరిశీలించారు.
అనంతరం ఆర్భికే ను సందర్శించి, ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియపై సిబ్బందిని వివరాలు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలుసుకున్నారు. రైతులకు సరైన తూకం వేసి, సరైన ధర అందించేందుకు సిబ్బంది నిబద్దతతో పనిచేయాలన్నారు. రైతు వివరాలు, బ్యాంకు ఖాతా సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డేటా ఎంట్రీ సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎటువంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

దుప్పలపూడి హౌసింగ్ లే అవుట్ ను పరిశీలించిన… జే సీ..

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు పథకం లక్ష్యాలను నిర్ణీత సమయం లోగా పూర్తి చేయాల్సి ఉందని జేసీ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. తుప్పలపూడి లే అవుట్ ను సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ లే అవుట్ వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా ఇసుక, సిమెంట్, ఐరన్ వంటి ముడి సరుకులు అందుబాటులో ఉంచుతున్నామని, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, హౌసింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో లబ్దిదారులకు అవగాహన పెంచి ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జేసీ వెంట మండల స్థాయి అధికారులు, సచివాలయ, అర్భికే సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement