విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ సిటీ న్యూస్ : ప్రతి విద్యార్థి ముందస్తు ప్రణాళికతో పరీక్షలకు సిద్దం అయినట్లు అయితేనే ఉత్తమ ఫలతాలుంటాయని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం దానవాయపేట లోని డి.ఎమ్.హెచ్. స్కూల్ లో పదవ తరగతి పరీక్షాకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో సంభాషించి ఉత్తేజాన్ని కల్పించారు. దృఢ సంకల్పముతో సాధించాలనే తపన ఉంటే ఎంతటి లక్ష్యాల నైనా సాకారం చేసుకో గలుగుతామని పేర్కొన్నారు.
పరీక్షా సమయం ముగిసే వరకు అక్కడే ఉన్న కలెక్టర్ విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.