Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇంటింటికి కుళాయిలు పనులకు టెండర్ ప్రక్రియ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జలజీవన్ మిషన్ చేపట్టింస్ పనులకు టెండర్ ప్రక్రియ
పూర్తయినా చోట పనులు వేగవంతం చేయాలి…
జిల్లా కిలెక్టర్ కృతికా శుక్లా

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ సిటి న్యూస్ : జిల్లాలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఇంటింటికి కుళాయి పనులు త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు వేసవి దృష్ట్యా శివారు ప్రాంతాలకు తాగునీటి సమస్యలు ఎదురుకాకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృతికా శుక్లా.. గ్రామీణ నీటిసరఫరా శాఖ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిన చోట పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా పనులు ప్రారంభం కానిచోట టెండర్ ప్రక్రియ చేపట్టేవిధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లాలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రూ. 22.37 లక్షలతో ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. గ్రామాల్లో మంచినీటి పథకాలు అయిన సమగ్ర రక్షిత నీటి సరఫరా, గ్రామీణ మంచినీటి పథకం, చేతిపంపులు నిర్వహణ సక్రమ నిర్వ‌హ‌ణ అంశాల‌ను ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా నీటి వృధాను అరికట్టాలన్నారు. జగనన్న కాలనీలలో నిర్మాణాలు పూర్త‌యిన చోట వెంటనే మంచినీటి సరఫరా అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. లేఅవుట్ల‌లో కొత్తగా చేపట్టిన నిర్మాణ పనులకు అవసరమైన నీటిని అందుబాటులో ఉంచాలని ఆమె తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌లో భాగంగా గ్రామ సచివాలయాల దగ్గర నిర్మిస్తున్న సామూహిక మరుగుదొడ్లు నిర్మాణ పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలో క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ల‌ను శుభ్రపరచి క్లోరినేషన్ చేయించాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా గ్రామ పంచాయతీ నిధులతో అవసరమైన మేరకు ట్యాంకర్ల ద్వారా మంచినీరును సరఫరా చేసే విధంగా ఆర్‌డ‌బ్ల్యూఎస్, గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ, తాళ్ళరేవు డీఈలు, జిల్లా ప్రజా పరిషత్, పంచాయతీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement